Nivetha Thomas: ఈయనే నా భర్త, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు… వకీల్ సాబ్ హీరోయిన్ షాకింగ్ ట్విస్ట్!

Nivetha Thomas: దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ జెంటిల్ మన్ చిత్రంతో నివేద థామస్ ని టాలీవుడ్ కి పరిచయం చేశారు. నాని డ్యూయల్ రోల్ చేసిన ఈ చిత్రం సూపర్ హిట్.

Written By: S Reddy, Updated On : July 4, 2024 5:52 pm

Nivetha Thomsa shocks everyone by introducing husband and children

Follow us on

Nivetha Thomas: నాకు పెళ్లి అయ్యింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారంటూ ట్విస్ట్ ఇచ్చింది వకీల్ సాబ్ ఫేమ్ నివేద థామస్. మీడియా ముఖంగా ఆమె చేసిన కామెంట్స్ చర్చకు దారి తీశాయి. అసలు నివేద థామస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంది? ఎప్పుడు పిల్లల్ని కన్నది? అని జనాలు వాపోతున్నారు. మేటర్ లోకి వెళితే… నివేద థామస్ చేసింది తక్కువ చిత్రాలే అయిన తెలుగు ప్రేక్షకుల మదిలో మంచి స్థానం సంపాదించుకుంది. ఆమెకు యూత్ లో ఫేమ్ ఉంది.

దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ జెంటిల్ మన్ చిత్రంతో నివేద థామస్ ని టాలీవుడ్ కి పరిచయం చేశారు. నాని డ్యూయల్ రోల్ చేసిన ఈ చిత్రం సూపర్ హిట్. నిన్ను కోరి చిత్రంలో నానితో మరోసారి జతకట్టింది. అది కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. జై లవకుశ మూవీలో ఏకంగా ఎన్టీఆర్ తో జతకట్టే ఛాన్స్ పట్టేసింది. దర్శకుడు బాబీ తెరకెక్కించిన జై లవకుశ సైతం హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

వరుస విజయాల నేపథ్యంలో నివేద థామస్ తెలుగులో బిజీ అయ్యారు. అయితే ఆమెకు స్టార్డం దక్కలేదు. బ్రోచేవారెవరురా, వకీల్ సాబ్ చిత్రాలు కూడా విజయం సాధించాయి. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ చిత్రంలో నివేద థామస్ కీలక రోల్ చేసింది. అంజలి, నివేద థామస్, అనన్య నాగళ్ళ చుట్టే ఈ కథ తిరుగుతుంది. తాజాగా నివేద 35 చిన్న కథ కాదు.. అనే చిత్రంలో నటించింది. ఈ మూవీ టీజర్ రిలీజ్ వేడుకలో పాల్గొన్న నివేద ఆసక్తికర కామెంట్స్ చేశారు.

మీడియాలో నా పెళ్లి వార్తలు చూసి మా అమ్మ ఆశ్చర్యపోయేది. నాకు తెలియకుండా నీకు పెళ్లి ఏంటి? అని అంటుండేది. అవును నాకు పెళ్లైంది. ఈయనే మా ఆయన. వీరిద్దరూ నా పిల్లలు అని వేదిక మీదున్న వారిని చూపించింది. విషయం ఏమిటంటే… 35 చిన్న కథ కాదు మూవీలో నివేద పెళ్ళై ఇద్దరు పిల్లలున్న గృహిణి పాత్ర చేసింది. ఆ చిత్రంలో తనకు భర్తగా, పిల్లలుగా నటించిన నటులను ఆమె పరిచయం చేసింది. అదన్నమాట సంగతి. 35 మూవీ ఆగస్టు 15న విడుదల కానుంది.