Keerthy Suresh: ‘వైజయంతి మూవీ మేకర్స్ బ్యానర్ తో , డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో హీరోయిన్ కీర్తి సురేష్ కి ఉన్నటువంటి అనుబంధం ఎంతో స్పెషల్. ఎందుకంటే ఇదే బ్యానర్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వం , కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మహానటి ‘ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది కాబట్టి. అంతే కాకుండా ఈ సినిమాలో అద్భుతంగా నటించినందుకు గానూ కీర్తి సురేష్ కి ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు కూడా దక్కింది. అందుకే వీళ్ళతో ఆమెకు ఒక ప్రత్యేకమైన అనుభందం ఉంటుంది. అప్పటి నుండి డైరెక్టర్ నాగ్ అశ్విన్ కీర్తి సురేష్ ని తన ప్రతీ సినిమాలో ఎదో ఒక విధంగా భాగం అయ్యేలా చూసుకుంటూ వస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం ‘కల్కి’.
ప్రభాస్ హీరో గా నటించిన ఈ విజువల్ వండర్ బాక్స్ ఆఫీస్ వద్ద క్రియేట్ చేసిన అద్భుతాలు సాధారణమైనవి కావు. ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాలో కీర్తి సురేష్ కి ఒక బలమైన క్యారెక్టర్ ని వదులుకుంది అట. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో , ఈ విషయం లో మాట్లాడుతూ ‘ ఈ చిత్రం లో నన్ను నాగ్ ఎదో ఒక విధంగా భాగం చేస్తాడని నాకు ముందే తెలుసు. ముందుగా ఆయన నాకు ఒక పాత్ర ఆఫర్ చేశారు. ఆ పాత్ర విన్నప్పుడు ఎందుకో నాకు అంత గొప్పగా అనిపించలేదు , వర్కౌట్ అవ్వదు అని చెప్పి రిజెక్ట్ చేశాను. ఇది జరిగిన మరుసటి రోజే నాగ్ అశ్విన్ నాకు ఫోన్ మరో పవర్ ఫుల్ పాత్ర ఉంది , కనీసం ఏదైనా చేస్తావా అని అడిగారు. అయితే ఈ పాత్ర కి షూటింగ్ సెట్స్ వరకు రావాల్సిన అవసరం లేదని , కేవలం గొంతు ఇస్తే చాలని అన్నారు’.
‘ముందుగా ఇది విని షాక్ కి గురయ్యాను. నేను షూటింగ్ కి రాకుండా , నా గొంతు తో పనేమీ ఉంటుందబ్బా అని అనుకున్నాను. కానీ కట్ చేసే బుజ్జి అనే వాయిస్ క్యారెక్టర్ చెప్పారు. అది నాకు చాలా నచ్చింది. సినిమా విడుదల తర్వాత నాకు గొప్ప పేరు కూడా తీసుకొచ్చింది. ముందుగా ఆఫర్ చేసిన పాత్ర ని నేను రిజెక్ట్ చేసినందుకు ఇప్పటికీ సంతోషంగానే ఉన్నాను. ఒకవేళ నేను ఆ పాత్రని రిజెక్ట్ చేయకపోయుంటే నాకు ఇంత పేరు తీసుకొచ్చింది బుజ్జి పాత్ర దొరికేది కాదు కదా’ అంటూ కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. ఇకపోతే ప్రస్తుతం ఆమె వెంకటేష్ , కళ్యాణ్ రామ్ , అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో, వెంకటేష్ కి జోడీగా నటిస్తోంది , రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.
