Furiosa A Mad Max Saga Movie OTT : ‘ప్యూరియెసా ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా’ మూవీ ఓటిటీ రిలీజ్ ఎప్పుడంటే.?

Furiosa A Mad Max Saga : ఇండియాలో హాలీవుడ్ సినిమాలకి విపరీతమైన అభిమానులు ఉంటారనే విషయం మనందరికీ తెలిసిందే. ఇక 'జార్జ్ మిల్లర్ ' దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విదేశాలలో చాలా బాగా ఆడినప్పటికీ ఇండియాలో మాత్రం అంత ఎక్కువ ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయింది.

Written By: NARESH, Updated On : July 4, 2024 7:46 pm

Furiosa A Mad Max Saga

Follow us on

Furiosa A Mad Max Saga Movie OTT : హాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలతో రిలీజ్ అయిన ‘ప్యూరియెసా ఏ మ్యాడ్ మాక్స్ సాగా’ అనే సినిమా ఈ సంవత్సరం మే 23 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా అన్ని దేశాల్లో కూడా మంచి వసూళ్లను రాబట్టినప్పటికీ ఇండియాలో మాత్రం ఆశించిన మేరకు విజయాన్నైతే సాధించలేదు. ఇక దాంతో ఈ సినిమా పెద్దగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. ఇక అప్పుడు థియేటర్ లో చూడని ప్రేక్షకులందరూ ఇప్పుడు ఈ సినిమాని ఓటిటి ప్లాట్ ఫామ్ లో చూడడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు.

అయినప్పటికీ ఈ సినిమా రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది… అయినప్పటికీ ఇప్పుడు ఆ సినిమాని అద్దెకి తీసుకొని మరి చూడాల్సి వస్తుందట. ఈ విషయం పట్ల అమెజాన్ యూజర్స్ ను చిరాకు పెట్టిస్తుంది. ఇక దానికోసమే అమెజాన్ ప్రైమ్ ఇంకో రెండు మూడు వారాల్లో ఈ సినిమాని తమ ఖాతాదారులందరికీ అందుబాటులో ఉండే విధంగా తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది… ఇక థియేటర్లో ఈ సినిమాని చూడటం మిస్ అయిన ప్రతి ఒక్కరు ఈ సినిమా కోసం విపరీతంగా ఎదురుచూస్తున్నారు.

ఇండియాలో హాలీవుడ్ సినిమాలకి విపరీతమైన అభిమానులు ఉంటారనే విషయం మనందరికీ తెలిసిందే. ఇక ‘జార్జ్ మిల్లర్ ‘ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విదేశాలలో చాలా బాగా ఆడినప్పటికీ ఇండియాలో మాత్రం అంత ఎక్కువ ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయింది. దానికి కారణం ఏంటి అంటే ఈ సిరీస్ లో ఇంతకుముందు వచ్చిన సినిమాలు ఎక్స్ట్రాడినరీగా ఉండడం వల్ల ఈ సినిమాకు అభిమానులు అంతగా కనెక్ట్ అవ్వలేకపోయారు.

ఇక దానివల్లే ఈ సినిమా కొంతవరకు ప్రేక్షకులను నిరాశపరిచిందనే చెప్పాలి. ఇక తొందర్లోనే ఆమెజాన్ ప్రైమ్ లో అందరికీ అందుబాటు ఉండే విధంగా ఈ సినిమాను తీసుకొస్తే మాత్రం సినిమాకి వ్యూస్ అయితే చాలా అద్భుతంగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి…చూడాలి మరి థియేటర్ లో ప్లాప్ అయిన ఈ సినిమా ఓటిటి లో ఎలాంటి రిజల్ట్ ను ఇస్తుంది అనేది…