Homeఎంటర్టైన్మెంట్Jana Nayagan OTT release: డైరెక్ట్ గా ఓటీటీ లోకి ఎంట్రీ ఇవ్వనున్న 'జన నాయగన్'..ఎందులో...

Jana Nayagan OTT release: డైరెక్ట్ గా ఓటీటీ లోకి ఎంట్రీ ఇవ్వనున్న ‘జన నాయగన్’..ఎందులో చూడాలంటే..

Jana Nayagan OTT release: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్ ‘ చిత్రం థియేటర్స్ లో విడుదల అవ్వడం ఇక దాదాపుగా కష్టమేనా అంటే, అవుననే అంటున్నాయి తమిళ వర్గాలు. నేడే ఈ చిత్రం పైరసీ చేసిన ప్రధాన నిందితుడిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉంది , కానీ ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి క్లియరెన్స్ మాత్రం రావడం లేదు. నిర్మాతలు సెన్సార్ సభ్యులు […]

Jana Nayagan OTT release: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్ ‘ చిత్రం థియేటర్స్ లో విడుదల అవ్వడం ఇక దాదాపుగా కష్టమేనా అంటే, అవుననే అంటున్నాయి తమిళ వర్గాలు. నేడే ఈ చిత్రం పైరసీ చేసిన ప్రధాన నిందితుడిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉంది , కానీ ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి క్లియరెన్స్ మాత్రం రావడం లేదు. నిర్మాతలు సెన్సార్ సభ్యులు చెప్పిన మార్పులు చేర్పులు చేసి, ఫైనల్ ఎడిట్ ని వాళ్లకు పంపినప్పటికీ కూడా, వాళ్ళు సెన్సార్ చేయడం లేదు. ఇందులో కచ్చితంగా రాజకీయ కుట్ర దాగి ఉందని అంటున్నారు విజయ్ ఫ్యాన్స్. ఇప్పుడు విజయ్ ఏకంగా తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి , ఆయన తలుచుకుంటే సెన్సార్ చేయించడం ఎంత పని అని కొందరు అంటుంటారు కానీ, సెన్సార్ బోర్డు రాష్ట్ర పరిధి లోకి రాదు.

కేంద్ర ప్రభుత్వ పరిధి లోకి వస్తుంది. తమిళనాడు లో ఎన్నికలకు ముందు బీజేపీ పార్టీ , టీవీకే ని పొత్తుకు ఆహ్వానించిందని , కానీ టీవీకే అందుకు ఒప్పుకోలేదని , ఎన్ని రకాల ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ కూడా, విజయ్ ఒప్పుకోకపోవడం తో , ఆయన్ని ఆర్థికంగా దెబ్బ తీసేందుకే ‘జన నాయగన్ ‘ చిత్రాన్ని ఈ విధంగా సెన్సార్ ద్వారా అడ్డుకున్నారని విజయ్ ఫ్యాన్స్ నుండి వినిపిస్తున్న వాదన. వాళ్ళ వాదనలో కూడా లాజిక్ ఉంది. వాస్తవానికి ఈ చిత్రాన్ని ఈ నెల 19 న ప్రేక్షకుల ముందుకు తీసుకొని రాబోతున్నామని, సెన్సార్ ఇక్కట్లు తొలగిపోతాయని ఆ చిత్ర నిర్మాతలు చాలా ధీమాగా ఉన్నారు. కానీ సెన్సార్ మొండితనం చూస్తుంటే , ఈ చిత్రానికి క్లియరెన్స్ ఇవ్వడానికి అసలు ఆసక్తి చూపుతున్నట్టుగా అనిపించడం లేదు. అందుకే మేకర్స్ ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీ లోకి విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారు.

ఓటీటీ కి ఎలాంటి సెన్సార్ అవసరం లేదు కాబట్టి , ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఫైనాన్షియర్స్ వద్ద తీసుకున్న డబ్బులకు వడ్డీలు నెలనెల విపరీతంగా పెరిగిపోతున్నాయి కాబట్టి , డైరెక్ట్ ఓటీటీ లోనే విడుదల చేసేందుకు నిర్మాతలు చూస్తున్నారని టాక్. ఇందుకోసం అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ తో చర్చలు కూడా మొదలు పెట్టారట. నిర్మాతలు దాదాపుగా అమెజాన్ ప్రైమ్ సంస్థ నుండి 275 కోట్ల రూపాయిలు ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం అయ్యాక విజయ్ నుండి వస్తున్న మొదటి చిత్రం , ఇదే ఆయన చివరి చిత్రం కూడా అవ్వడంతో , వేరే లెవెల్ లో లాభాలు వస్తాయి కాబట్టే, ఈ రేంజ్ డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper