Tollywood Producer Track: టాలీవుడ్ లో అత్యధిక సక్సెస్ రేట్ ఉన్న నిర్మాతలలో ఒకరు దిల్ రాజు(Dil Raju). ఇప్పటి వరకు 58 సినిమాలు తీస్తే అందులో 70 శాతం సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. ఈ కాలం లో ఈ రేంజ్ సక్సెస్ రేట్ ఉండడం అనేది సాధారణమైన విషయం కాదు. దిల్ రాజు కథల ఎంపిక అంత కచ్చితంగా ఉంటుందని ఇండస్ట్రీ లో ఒక మంచి ఇమేజ్ ఉంది. అయితే ఈ ఇమేజ్ ఇప్పుడు మెల్లగా మసకబారుతుంది. ఒకప్పుడు దిల్ రాజు సినిమా అంటే ఒక బ్రాండ్. ఈ సంస్థ నుండి ఒక సినిమా విడుదల అవుతుందంటే కచ్చితంగా సూపర్ హిట్ అని ఫిక్స్ అయిపోతున్నారు జనాలు. అలాంటి దిల్ రాజు ఇప్పుడు ఏ సినిమా ముట్టుకున్నా మసి అయిపోతుంది. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలు దిల్ రాజు కొంపని కొల్లేరు చేసేసింది.
Also Read: భజరంగి భాయ్ జాన్’ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా..? ఈమె ఇప్పుడు బాలయ్య సినిమాలో హీరోయిన్!
ఈ ఏడాది ప్రారంభం లో దిల్ రాజు నుండి విడుదలైన భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం ‘గేమ్ చేంజర్'(Game Changer Movie) కమర్షియల్ గా ఎంత పెద్ద డిజాస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దాదాపుగా 300 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా కేవలం వంద కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. కానీ ఈ సినిమా విడుదలైన నాలుగు రోజులకే ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vastunnam) చిత్రం తో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యారు. అతి తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం ఏకంగా 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. నిర్మాత దిల్ రాజు ని పూర్తిగా కుప్పకూలిపోకుండా కాపాడింది. అయితే నిన్న విడుదలైన ‘తమ్ముడు'(Thammudu Movie) చిత్రం కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాని ఎంత స్పెషల్ కేర్ తీసుకొని దిల్ రాజు ప్రమోట్ చేసాడో మనమంతా చూసాము.
Also Read: విడిపోతున్న నయనతార, విఘ్నేష్? వేణు స్వామి చెప్పింది నిజం కాబోతుందా?
ఈ సినిమా ప్రొమోషన్స్ లో ‘గేమ్ చేంజర్’ గురించి మాట్లాడి తీవ్రమైన విమర్శలకు కూడా గురి అయ్యాడు. చివరికి ఆయన కెరీర్ లో అత్యంత భారీ డిజాస్టర్ చిత్రం గా నిల్చింది తమ్ముడు. ఈ చిత్రానికి దిల్ రాజు 75 కోట్ల రూపాయిలు ఖర్చు చేసాడు. అందులో 30 కోట్లు నాన్ థియేట్రికల్ నుండి వచ్చాయి. థియేటర్స్ నుండి 10 శాతం కూడా రికవరీ అయ్యేలా కనిపించడం లేదు. మొదటి రోజు ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి కోటి రూపాయిల లోపే షేర్ వసూళ్లు వచ్చాయంటే ఎంత పెద్ద డిజాస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు. దీనిని బట్టీ చూస్తుంటే దిల్ రాజు కి భారీ బడ్జెట్ సినిమాల గండం ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇక నుండి అయినా ఆయన వాటికి దూరంగా ఉంటాడా?,లేదా అనేది చూడాలి.