Rakul Preet Singh Husband: సౌత్ ఇండియా లోనే బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరు రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh). ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే ఆమె రేంజ్ ని అందుకుంది. అయితే ఇప్పుడు వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ కారణంగా రకుల్ ప్రీత్ సింగ్ కి ఇటు సౌత్ లోనూ , నార్త్ లోనూ డిమాండ్ పూర్తిగా తగ్గిపోయింది. ఈమెతో సినిమాలు చేసేందుకు ఏ నిర్మాత కూడా ఆసక్తి చూపించడం లేదు. సీనియర్ రేంజ్ హీరోలు కూడా ఈమెపై ఆసక్తి చూపడం లేదు. దీంతో పెద్ద సినిమాల్లో క్యారక్టర్ రోల్స్ చేయడానికి కూడా రెడీ అయిపోయింది. రీసెంట్ గానే రామాయణ్ గ్లింప్స్ వీడియో ని మీరందరు చూసే ఉంటారు. ఇందులో రకుల్ ప్రీత్ సూర్పనక్క క్యారక్టర్ చేస్తుంది. సీత పాత్రలో కనిపించాల్సిన రకుల్ ప్రీత్, ఒక రాక్షసి పాత్ర చేయడానికి సిద్దమయిందంటే ఆమె పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇకపోతే రీసెంట్ గానే ఈమె జాకీ భగ్నానీ(Jackky Bhagnani) అనే అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈయన ఒక ప్రముఖ బిజినెస్ మ్యాన్, అదే విధంగా బాలీవుడ్ లో నిర్మాత కూడా. గత ఏడాది ఈయన ‘బడే మియా..చోటే మియా’ అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించాడు. అక్షయ్ కుమార్(Akshay Kumar), టైగర్ ష్రాఫ్(Tiger Shroff) ఇందులో హీరోలుగా నటించారు. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో జాకీ భగ్నానీ పని అయిపోయిందని, దివాలా తీసాడని, కనీసం తన స్టాఫ్ కి జీతాలు కూడా ఇచ్చుకోలేని దయనీయమైన స్థితిలోకి వచ్చాడని సోషల్ మీడియా లో అనేక ప్రచారాలు జరిగాయి. రకుల్ ప్రీత్ ఇతను చేసిన అప్పులను తీర్చేందుకు సినిమాలు చేస్తుంది అంటూ కూడా ప్రచారం జరిగింది. దీనిపై జాకీ భగ్నానీ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో స్పందించాడు.
ఆయన మాట్లాడుతూ ‘అప్పట్లో ఈ సినిమా నిర్మాణం కోసం నేను జుహు కార్యాలయాన్ని తాకట్టు పెట్టాను. ఇప్పుడు ఆ కార్యాలయాన్ని నేను వెనక్కి తీసుకోగలిగాను. వార్తల్లో హాట్ టాపిక్ గా నిల్చిన భవనం ఇదే. అయితే ఈ భవనం అప్పులు తీర్చడం కోసం నేను అమ్మేశానని, సినిమా ఫ్లాప్ అవ్వడంతో అన్నం తినడానికి కూడా నా వద్ద డబ్బులు లేవని, అప్పులు ఇచ్చిన వాళ్లకు భయపడి పారిపోయానని, ఇలా ఒక్కటా రెండా..ఎన్నో వార్తలు సోషల్ మీడియా లో ప్రచారం అయ్యాయి. ఈ వార్తలు ఎక్కడ మొదలు అయ్యాయో నాకు తెలియదు. ఈ రూమర్స్ ని పట్టించుకునేంత సమయం నాకు లేదు, వాటిని ప్రచారం చేసిన వారిని కూడా నిందించాలని నేను కోరుకోవడం లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు జాకీ భగ్నానీ. ఆయన మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.