Bajrangi Bhaijaan Child Artist: బాలనటులుగా నటించిన ఎంతో మంది మన కళ్ళముందే పెద్దవాళ్లుగా మారిపోయి ఇప్పుడు హీరోలుగా,హీరోయిన్లుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెడుతున్నారు. కొంతమంది సక్సెస్ అయ్యారు,మరికొంత మంది సక్సెస్ కాలేకపోతున్నారు. ఉదాహరణకు బాలనటుడిగా మంచి పేరు సంపాదించిన తేజ సజ్జ,పెద్ద అయ్యాక హీరో గా మారి, నేడు హనుమాన్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని అందుకొని పాన్ ఇండియన్ హీరో గా మారిపోయాడు. తేజ సజ్జ లాగానే మనసంతా నువ్వే ఫేమ్ కావ్య కళ్యాణ్ రామ్ కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఈమె మాత్రం సక్సెస్ కాలేకపోయింది. ఇప్పుడు మరో చైల్డ్ ఆర్టిస్ట్ పెద్దయ్యాక మన ముందుకు రాబోతుంది. 2015 వ సంవత్సరం లో విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సల్మాన్ ఖాన్(Salman Khan) ‘భజరంగి భాయిజాన్’ లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన అమ్మాయి గుర్తుందా?.
మున్ని పాత్రలో ఎంతో క్యూట్ గా నటించి అప్పట్లో ప్రేక్షకుల మనసుల్ని దోచుకుంది ఈ చిన్నారి. ఈ చిన్నారి పేరు హర్షాలీ మల్హోత్రా(Harshali Malhotra). ‘భజరంగి భాయిజాన్’ బాలీవుడ్ లో పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈమెకు అవకాశాలు బాగా వచ్చాయి. సినిమాల్లోకి రాకముందు ఈమె బాలీవుడ్ టీవీ సీరియల్స్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఉండేది. మనం అప్పుడప్పుడు స్టార్ మా ఛానల్ లో ‘ఇది కథ కాదు’ అనే క్రైమ్ స్టోరీస్ సిరీస్ ని చూస్తుంటాము గుర్తుందా?,ఇందులో కూడా హర్షాలీ మల్హోత్రా కొన్ని ఎపిసోడ్స్ లో కనిపించింది. అలా చిన్నతనం లోనే మంచి పాపులారిటీ ని తెచ్చుకున్న ఈమెను గుర్తించిన సల్మాన్ ఖాన్ తన సినిమాలో పిలిచిమరీ అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు ఈ చిన్నారికి 17 ఏళ్ళు వచ్చాయి. సోషల్ మీడియా లో ఈమె ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలు, రీల్స్ అప్లోడ్ చేస్తూ ఉంటుంది.
అయితే ఇప్పుడు ఈమె నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబినేషన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘అఖండ 2′(Akhanda 2 Movie) చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా కమర్షియల్ గా హిట్ అయితే ఇక హర్షాలీ మల్హోత్రా కి హీరోయిన్ గా అవకాశాలు మన టాలీవుడ్ లో క్యూలు కట్టేస్తాయి. ఈమె అందం శ్రీలీలకు, మీనాక్షి చౌదరీ కి ఏమాత్రం తీసిపోనిది కాదు. నటన కూడా చాలా బాగా చేస్తుంది కాబట్టి టాలీవుడ్ లోకి ఈమె ఎంట్రీ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న టాప్ స్టార్స్ అందరికి ఒక వార్నింగ్ కాల్ లాంటిది అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. చూడాలి మరి ‘అఖండ 2’ లో ఈమె ఎలా నటించబోతుంది అనేది. రీసెంట్ గానే ఈ సినిమా టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ ని తెచ్చుకుంది. సెప్టెంబర్ 25 న ఈ చిత్రం విడుదల కాబోతున్నట్టు నిర్మాతలు అధికారిక ప్రకటన చేశారు.
View this post on Instagram