Surekha Vani: ఆంటీ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయిన ప్రముఖ నటి ‘సురేఖావాణి’కి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఇక ఆమె కూతురు సుప్రీత కి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. అయితే, ఆమె ఈ మధ్యనే ఓ ప్రైవేట్ విడియో సాంగ్ లో నటించింది. మొత్తానికి ఈ తల్లి కూతుర్ల క్రేజ్ ను వాడుకోవాలని ఓ అజ్ఞాత వ్యక్తి ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలో చాలా ప్లాన్డ్ గా మూవ్ అయ్యాడు.
తాను సురేఖ వాణికి బాగా సన్నిహితుడిని అని చెప్పుకుంటూ పరిచయాలు పెంచుకున్నాడు. పైగా సురేఖావాణి పేరు పై సోషల్ మీడియాలో పేజెస్ కూడా క్రియేట్ చేశాడు. అలాగే వాట్సప్ లో కూడా కొంత మందికి మెసేజ్ లు పంపాడు. మొత్తానికి సురేఖావాణి పేరు చెప్పి వాళ్ళ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ కూడా అడిగి తీసుకున్నాడు. అయితే, ఈ విషయం కాస్త సురేఖ వాణి వద్దకు వెళ్ళింది.
Also Read: అలాంటి వాడితోనే నా పెళ్లి – రష్మిక మందన
వెంటనే సురేఖావాణి అలెర్ట్ అయ్యి అలాంటి వాటిని నమ్మి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్,బ్యాంక్ డీటైల్స్ వంటివి ఎవ్వరికీ చెప్పకండి అని, దయచేసి మీ డబ్బులు ఎవ్వరికీ పంపకండి అంటూ విజ్ఞప్తి చేసింది. గతంలో సునీత కూడా ఇలాగే మోసపోయింది. ఇక నలభై ఏళ్ల వయసులో ఎక్కువ అందంగా ఉందని, ఆమెకి మగాళ్లు నుంచి విచ్చలవిడిగా కాంప్లిమెంట్స్ వస్తున్నాయని సురేఖా ఆంటీ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సిగ్గు పడుతూ చెప్పుకొచ్చింది.
పనిలో పనిగా తన రెండో పెళ్లి గురించి ఆమె ఓపెన్ అయిపోయింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇంకా పెళ్లి కాకుండా మిగిలిపోయిన కొందరు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటూ తెగ ప్రపోజల్ పెడుతున్నారట. ఈ లిస్ట్ లో చాలా మంది మగవాళ్ళు ఉన్నారట. మొత్తానికి సురేఖా వాణికి ఉన్న డిమాండ్ ను చూస్తుంటే.. త్వరలోనే ఆమె రెండో పెళ్లికి స్క్రీన్ సిగ్నల్ ఇచ్చేలా ఉంది.
Also Read: టాలీవుడ్ ప్రజెంట్ క్రేజీ మూవీ అప్ డేట్స్ !