Prabhas Biography: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. న్యూ ఐడియాలజీ, బెస్ట్ క్రియేటివిటీ, ది బెస్ట్ యాక్టింగ్ అన్నింటి కలబోతే ఆ హీరో. హాలీవుడ్ నే మెస్మరైజ్ చేసిన (సాహో) సినిమాలు చేస్తూ టాలీవుడ్ జేమ్స్ బాండ్ గా గుర్తింపు దక్కించుకోవడం సాధారణమేమీ కాదు. తెలుగు ఇండస్ట్రీకి డార్లింగ్ గా క్రమశిక్షణ ఉన్న నటుడిగా ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. టాలీవుడ్ నుంచి వచ్చిన ఈ యంగ్ రెబల్ స్టార్ బాహుబలితో బాలీవుడ్ కే జలక్ ఇచ్చాడు. ఇక ముందున్న ప్రాజెక్టులన్నీ దాదాపు పాన్ ఇండియా స్థాయిలోనే నిర్మాణమవుతున్నాయి.

ఉప్పలపాటి వెంకటసూర్యనారాయణ రాజు-శివకుమారి దంపతులకు 1979, అక్టోబర్ 23న రెండో సంతానంగా జన్మించాడు ప్రభాస్. స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు.
ఆయన పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సూర్య ప్రభాస్ రాజు ప్రభాస్ కు అన్న ప్రబోధ్, చెల్లెలు ప్రగతి ఉన్నారు. ప్రాథమిక విద్య భీమవరంలోని డీఎన్ఆర్ స్కూల్ లో, బీటెక్ హైదరాబాద్ లోని శ్రీచైతన్య ఇంజినీరింగ్ కాలేజ్ లో పూర్తి చేశాడు. చిన్న తనం నుంచి చదువులోనూ, వాలీబాల్ లో కూడా దూసుకుపోయేవాడు రెబెల్ స్టార్. పెదనాన్న కృష్ణంరాజులాగే మంచి భోజన ప్రియుడు. ఆతిథ్యం ఇవ్వడంలో ఈ రెబల్ కుటుంబాన్ని ఎవరు అందుకో లేరని టాలీవుడ్, బాలీవుడ్ లో ప్రతీతి.
హీరోలు షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఇక హీరోయిన్ల విషయానికస్తే పాత తరంలో జయసుధ, తర్వాత శ్రేయ శరణ్, త్రిష క్రిష్ణన్, బాలీవుడ్ లో రవీణా ఠాండన్, దీపికా పదుకొణె.

– సినిమాలు
ప్రభాస్ సినిమా అంటేనే హై రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్ ఉంటుంది. టాలీవుడ్ సీనియర్ హీరో, పెదనాన్న రెబెల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. తండ్రి సూర్య నారాయణ రాజు నిర్మాతగా పలు సూపర్ హిట్ చిత్రాలు నిర్మించారు. 2002లో జయంత్ సీ పరాన్జీ దర్శకత్వంలో ఈశ్వర్ మూవీతో టాలీవుడ్ ఇండస్ర్టీకి ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్. ఇది మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత 2003లో విడుదలైన రాఘవేంద్ర పరాజయం పాలైన మాస్ హీరోగా ఎలివేట్ చేసింది. 2004లో శోభన్ దర్శకత్వంలో వచ్చిన వర్షం మంచి కలెక్షన్లు రాబట్టి సంతోషం ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో ఉత్తమ నటుడిగా కూడా నిలబెట్టింది. మాస్ హీరోతో పాటు లవర్ బాయ్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వచ్చిన అడవి రాముడు (2004)యావరేజ్ గా నిలిచింది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో చక్రం(2005) సినిమా భారీ అంచనాలతో వచ్చినా బిగ్గెస్ట్ డిజాస్టర్ ను మూట గట్టకుంది. కానీ నటనా పరంగా ప్రభాస్ కు మంచి మార్కులు పడ్డాయి. 2005లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మరో సినిమా ఛత్రపతి. ఇందులో ప్రభాస్ నటనకు తెలుగు చిత్ర పరిశ్రమ దాసోహమైంది. ఆయనలో మరో కోణం ప్రేక్షకులకు చూపించి ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా తెచ్చి పెట్టింది. తిరుగు లేని మాస్ హీరోగా నిలబెట్టింది. 2006లో ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన పౌర్ణమి పరాజయం పాలైంది. వివి వినాయక్ దర్శకత్వంలో 2007లో వచ్చిన యోగి మరోసారి తనలోని మాస్ యాంగిల్ ని ఎలివేట్ చేసినా హిట్ సొంతం చేసుకోలేకపోయింది.

2007 లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రిలీజైన మున్నా విజయాన్ని దక్కించుకుంది. అప్పటి వరకు లుక్ లో డిఫరెన్స్ చూపని రెబెల్ స్టార్ ఈబసినిమాతో పూర్తిగా స్టైలిష్ లుక్స్లో మేకోవర్ అయ్యాడు. ఇక 2008లో క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో కలిసి బుజ్జిగాడులో నటించాడు ప్రభాస్. ఈ సినిమాతో డైలాగ్ మాడ్యులేషన్ పూర్తిగా మార్చేశాడు. కామెడీ టైమింగ్ లోనూ డిఫరెంట్ మేనరిజం ట్రై చేశాడు. ఈ సినిమాతో అందరి డార్లింగ్ అయ్యాడు. ఇది కూడా మంచి విజయాన్నే ఖాతాలో వేసుకుంది. 2009లో మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కింది బిల్లా. క్రూరమైన డాన్, చిల్లర దొంగగా ప్రభాస్ నటన భిన్నమైన కోణాలను చూపించింది. డాన్ గా ప్రభాస్ ఎక్సలెంట్ గా పెర్ఫామెన్స్ ఇచ్షాడు. మళ్లీ పూరీ దర్శకత్వంలో వచ్చిన ఏక్ నిరంజన్ ఆకట్టుకోలేకపోయింది. 2010లో కరుణాకర్ దర్శకత్వంలో వచ్చిన డార్లింగ్ మూవీ క్లాస్ హీరోగా భారీ విజయాన్ని తెచ్చింది. క్లాస్ హీరోగా కొనసాగుతూ 2011లో వచ్చిన సినిమా మిస్టర్ పర్ ఫెక్ట్ ప్రభాస్ క్లాస్ హీరోగా డార్లింగ్ కన్నా ఒక మెట్టు పైకి ఎక్కించింది. బెస్ట్ కొరియోగ్రాఫర్ లారెన్స్ ప్రభాస్ లో మరో కోణం చూశాడు. తన దర్శకత్వంలో 2012లో రెబెల్ ను తెరకెక్కించాడు. సినిమా స్టోరీ బెటరే కానీ ప్రేక్షకులను ఆకట్టుకోలేక పరాజయం పాలైంది. ఇందులోని ఫైట్స్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. 2013లో కొరటాల శివ తెరకెక్కించిన మిర్చీ క్లాస్, మాస్ కలబోతగా మంచి హిట్ తెచ్చింది. టాలీవుడ్ లో తనకు తిరుగు లేదని నిరూపించుకున్నాడు ప్రభాస్. 2014లో ప్రభుదేవా దర్శకత్వంలో హిందీలో వచ్చిన యాక్షన్ జాక్సన్ సినిమాలో డార్లింగ్ గెస్ట్ రోల్ కనిపించాడు. ఇక 2015లో జక్కన్న (రాజమౌళి) దర్శకత్వంలో వచ్చిన బాహుబలి-1 (ది బిగినింగ్) జూలై 10న తెలుగుతో పాటు తమిళ, హిందీ, మళయాళీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. భారత చలన చిత్ర రంగంలో ముందెన్నడూ వసూలు చేయని కలెక్షన్లను వసూలు చేసి అఖండ విజయం సాధించింది. బాహుబలి-2 (ది కన్ క్లూజన్) 2017, ఏప్రిల్ 28న విడుదలై ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే వెయ్యి కోట్ల మైలు రాయిని దాటిన చిత్రంగా నిలిచింది. ఇది వరల్డ్ వైడ్ గా 2000 కోట్లు వసూలు సాధించడంలో అతిశయోక్తిలేదు. దీంతో ప్రభాస్ అంతర్జాతీయంగా స్టార్ డమ్ సంపాదించాడు. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో 2019లో 350 కోట్ల భారీ బడ్జెట్, సూపర్ విజువల్ ఎఫెక్ట్స్ తో వచ్చిన సాహో హాలీవుడ్ రేంజ్ ని తలపించింది. ఈ సినిమా సౌత్ లో సక్సెస్ కాలేకపోయినా నార్త్ లో మాత్రం బాలీవుడ్ సూపర్ స్టారదలకు దీటుగా విపరీతమైన వసూళ్లు సాధించింది. ప్రస్తుతం రాధేశ్యామ్ 400 కోట్లతో నిర్మించగా భారీ స్థాయిలో విడుదలకు సిద్దమైంది. ఆదిపురుష్ 2023 సంక్రాతికి వస్తున్నట్లు శివరాత్రి రోజున మేకర్స్ ప్రకటించారు. వీటి తర్వాత వైజంతీ బ్యానర్ పై దీపికా పదుకొణెతో తీస్తున్న సినిమాకు ఇంకా పేరు ఖరారు కాకున్నా వర్కింగ్ టైటిల్ గా ‘కే’ అని పిలుస్తున్నారు. రాబోయే సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయులోనే ప్లాన్ చేస్తున్నాడు. రెబెల్ స్టార్.
Also Read:‘సురేఖావాణి’ని వాడుకుని మోసం.. అలెర్ట్ అయిన సురేఖావాణి !
– బ్రాండ్ అంబాసిడర్
ఒక్క సినిమాకు దాదాపు 200 కోట్లు తీసుకునే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చాలా బ్రాండ్లకు అంబాసిడర్ గా ఉన్నాడు. పాపులారిటీ, ఇన్ కంలో ప్రపంచంలోనే టాప్ 100లో ఫోర్బ్స్ పత్రిక ప్రభాస్ ను చేర్చింది. నెలకు దాదాపు 3 కోట్లతో ఏడాదికి 40 కోట్లు ఆర్జిస్తున్నాడనంలో ఆశ్చర్యం లేదు. మహీంద్రా టీయూబీ 300 కార్, సెలియో క్లాత్, హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ పే జాప్ జియోనీ ఇండియాతో పాటు టాప్ బ్రాండ్లకు అంబాసిడర్ గా ఉన్నాడు ప్రభాస్.
Also Read: అలాంటి వాడితోనే నా పెళ్లి – రష్మిక మందన