Homeఎంటర్టైన్మెంట్Ranveer Singh threat call: 'ధురంధర్' హీరోకి బెదిరింపు ఫోన్ కాల్స్..భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేసిన...

Ranveer Singh threat call: ‘ధురంధర్’ హీరోకి బెదిరింపు ఫోన్ కాల్స్..భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం!

Ranveer Singh threat call: ఈమధ్య కాలంలో బాలీవుడ్ సినీ ప్రముఖులకు బెదిరింపు ఫోన్ కాల్స్ ఎక్కువ అయిపోయాయి. సల్మాన్ ఖాన్ ని లారెన్స్ బిష్ణోయ్ అనే అతను చంపేస్తాము అని బెదిరించడం, అదే విధంగా సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి కొంతమంది చొరబడి ఆయన్ని తీవ్రమైన గాయాలకు గురి చేయడం వంటివి బాలీవుడ్ లో ఎంతటి సెన్సేషనల్ టాపిక్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అదే విధంగా రీసెంట్ గా ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి ఇంటి వద్ద గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు కాల్పులు జరపడం పెద్ద కలకలం సృష్టించింది. దీంతో ముంబై పోలీసులకు ఇలా సెలబ్రిటీలకు వస్తున్న బెదిరింపుల దృష్ట్యా, సగం వాళ్లకు సెక్యూరిటీ ఇవ్వడానికే వాళ్లకు సగం సమయం అయిపోతుంది. ఇప్పుడు రీసెంట్ గా ఆ జాబితా లోకి ‘ధురంధర్’ హీరో రణవీర్ సింగ్ కూడా చేరిపోయాడు.

‘ధురంధర్’ సక్సెస్ ని ఎంజాయ్ చేయాల్సిన సమయంలో, బెదిరింపులను ఎగురుకుంటూ బిక్కుబిక్కుమంటూ భయపడే పరిస్థితి కి వచ్చాడు రణవీర్ సింగ్. పూర్తి వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గానే రణవీర్ సింగ్ కి వాట్సాప్ లో ఒక బెదిరింపు వాయిస్ మెసేజ్ వచ్చిందట. ఆ వాయిస్ మెసేజ్ ద్వారా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి రణవీర్ సింగ్ ని కోట్ల రూపాయిలను డిమాండ్ చేసినట్టు తెలిసింది. ఈ బెదిరింపుల వెనుక లారెన్స్ బిష్ణోయ్ హస్తం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మంగళవారం రోజున ఈ ఘటన జరగడం తో రణవీర్ సింగ్ వెంటనే పోలీసులను ఆశ్రయించి, కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో ఆయన ఉండే అపార్ట్మెంట్స్ లో చుట్టూ భారీ ఎత్తున బందోబస్తు పెంచారు పోలీసులు. అయితే ఇక్కడ సెక్యూరిటీ పటిష్టంగా ఉండడం వల్ల, అక్కడ నివసించే జనాలకు కాస్త తలనొప్పిగా మారింది.

బిల్డింగ్ లాబీ, జిమ్, మరియు పిల్లలు ఆదుకునే ప్రాంతాల్లో సెక్యూరిటీ సిబ్బంది తుపాకులతో తురుగుతూ ఉండడం వల్ల తమకు ఇబ్బందిగా ఉందని సొసైటీ మ్యానేజింగ్ కమిటీ పోలీసులకు లేఖ రాసింది. కేవలం రణవీర్ సింగ్ సెక్యూరిటీ కోసం ఇంతమందిని ఇబ్బందికి గురి చేయడం, ఎంతవరకు సబబు అంటూ పోలీసులను ప్రశ్నిస్తున్నారు. బిల్డింగ్ మొత్తం ఆయుధాలతో పహారా కాయడం వల్ల, రెసిడెంట్స్ భయాందోళనకు గురి అవుతున్నారని వారు పేర్కొన్నారు. ఇకపోతే రీసెంట్ గా రోహిత్ శెట్టి ఇంటిపై జరిపిన కాల్పుల ఘటనకు, రణవీర్ సింగ్ కి వచ్చిన వాయిస్ మెసేజ్ కి మధ్య ఏమైనా లింక్ ఉందా అనే కోణం లో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇకపోతే రణవీర్ సింగ్ హీరో గా నటించిన ‘ధురంధర్ 2 ‘ చిత్రం వచ్చే ఏడాది 19 న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: జగన్ జైలు పరామర్శలు.. వైసీపీలో కొత్త చర్చ!

YS Jagan Mohan Reddy: వైయస్ జగన్మోహన్ రెడ్డి మొండివాడు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు స్వయంగా చెబుతారు. అయితే ఆయన మొండితనం ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావచ్చు. కానీ అదే...
Bonda Umamaheswara Rao

Bonda Uma Maheswara Rao: బోండా ఉమా పై వైసీపీ స్కెచ్!

Bonda Uma Maheswara Rao: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా టిడిపిలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. దీనిపై టిడిపి హై కమాండ్ ఆగ్రహంగా...
Loan Advice

Loan Advice: అప్పు ఇవ్వాలా? వద్దా? ఇస్తే ఏం జరుగుతుంది?

Loan Advice: డబ్బు ప్రతి ఒక్కరికీ అవసరం ఉంటుంది. అయితే కొందరి వద్ద తక్కువగా.. మరికొందరి వద్ద ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో డబ్బు ఉన్న వారి వద్ద లేనివారు అప్పుగా...
AP Ration Cards

AP Ration Cards: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్!

AP Ration Cards: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరింత నాణ్యమైన బియ్యం అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు స్టీమ్డ్ రైస్ అందించనుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఈ...
Tollywood Heroes Injuries

Tollywood Heroes Injuries: టాలీవుడ్ కు ఏంటీ శాపం.. హీరోల వరుస గాయాల వెనుక ఏముంది..?

Tollywood Heroes Injuries: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు బిజీగా ఉన్నారు. ఒక్కో సినిమాతో ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళుతున్న మన స్టార్ హీరోలు ఎలాంటి డూపులు...
Oktelugu Epaper