Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ మొదలై 6 వారాలు అయ్యింది. కానీ హౌస్ లో ఇంకా 16 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వారాలు గడిచే కొద్దీ కంటెస్టెంట్స్ సంఖ్య తగ్గాలి కానీ , ఇక్కడ మాత్రం ఇంకా నిండుగానే ఉంది. గత వారం దసరా సందర్భంగా ఎలిమినేషన్ ని నిర్వహించలేదు బిగ్ బాస్ టీం. ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం అయితే షాలిని కి అందరికంటే తక్కువ ఓట్లు వచ్చాయి. రూల్స్ ప్రకారం ఆమెని ఎలిమినేట్ చెయ్యాలి. కానీ అది జరగలేదు. ఒకవేళ షాలిని కి బదులుగా వంశీ , లేదా వర్షిణి కి తక్కువ ఓట్లు వచ్చి ఉండుంటే , కచ్చితంగా వాళ్ళని ఎలిమినేట్ చేసేవారు. ఎందుకంటే వాళ్ళ నుండి ఫైర్ కంటెంట్ రావడం లేదు కాబట్టి. కానీ షాలిని బోలెడంత కంటెంట్ ఇస్తుంది.
ఒకపక్క రోహిత్ తో లవ్ ట్రాక్ కంటెంట్ ఇస్తుంది. ఇది చాలా మందికి క్రింజ్ గా అనిపించొచ్చు కానీ , యూత్ ఆడియన్స్ ఈ షోని ఇలాంటి లవ్ ట్రాక్స్ కోసమే చూస్తుంటారు. ఆ ఒక్క కారణమే కాదు , ఈమె ప్రతీ సందర్భం లోనూ తన తోటి కంటెస్టెంట్స్ తో గొడవలు పెట్టుకుంటూ ఉంటుంది. ఇదంతా టీఆర్ఫీ రేటింగ్స్ ని రప్పించే కంటెంట్. ఆ కారణం చేత , ఆమెని సీక్రెట్ రూమ్ కి పంపించారు. నిన్న రాత్రి షాలిని బిగ్ బాస్ హౌస్ లోకి గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చింది. ఇదంతా పక్కన పెడితే ఈ వారం నామినేషన్స్ లోకి ఏకంగా 12 మంది కంటెస్టెంట్స్ వచ్చారు. అందులో వైల్డ్ కార్డ్స్ కంటెస్టెంట్స్ ఎక్కువ శాతం ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ఓటింగ్ ప్రకారం చూస్తే నీతూ మాస్టర్, దక్షి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే నేడు లైవ్ ని చూస్తే ఒకటి స్పష్టంగా చెప్పేసాడు బిగ్ బాస్. ఒక ఎలిమినేషన్ ఆడియన్స్ ఓటింగ్ ద్వారా ఉంటుంది అట , మరో ఎలిమినేషన్ మాత్రం టాస్కుల పెర్ఫార్మన్స్ ద్వారా ఉంటుందట.
బిగ్ బాస్ ఈ వారం టాస్కులు ఆడేందుకు కంటెస్టెంట్స్ ని రెడ్ గ్రూప్, ఆరెంజ్ అని రెండు గ్రూప్స్ గా డివైడ్ చేశారు. రెడ్ గ్రూప్ లో ఇప్పటి వరకు బాగా ఆడని కంటెస్టెంట్స్ ని పెట్టాడు బిగ్ బాస్. అందులో రోహిత్ ఉండడం గమనార్హం. హౌస్ లో ఇప్పటి వరకు ఎలాంటి మార్కు ని ఏర్పాటు చేసుకోలేకపోయిన దేబ్జాని, వర్షిణి , నరేష్ లను మాత్రం ఆరెంజ్ గ్రూప్ లో పెట్టాడు బిగ్ బాస్. ఇప్పుడు లెవెల్స్ వారీగా నిర్వహించే టాస్కుల్లో రెడ్ టీం లో ఉన్నవాళ్లు ఎవరైతే గేమ్స్ గెలుస్తారో , వాళ్ళు ఆరంజ్ జోన్ లోకి వెళ్తారు. ఆరెంజ్ జోన్ లో ఉన్నవాళ్లకు టాస్కులు నిర్వహించి , అందులో గెలిచిన వాళ్ళు గ్రీన్ జోన్ లోకి వెళ్లి నామినేషన్స్ నుండి తప్పించుకుంటారు. చూడాలి మరి డబుల్ ఎలిమినేషన్ లో ఈ వారం టాస్కుల ద్వారా ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఆడియన్స్ ఓటింగ్ ద్వారా ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది.