Homeఎంటర్టైన్మెంట్Rajasaab movie trolls: ఇది 'రాజా సాబ్' కాదు..'డూప్ సాబ్'..చివరికి హీరోయిన్ కూడా అబద్ధమేనా? వైరల్...

Rajasaab movie trolls: ఇది ‘రాజా సాబ్’ కాదు..’డూప్ సాబ్’..చివరికి హీరోయిన్ కూడా అబద్ధమేనా? వైరల్ అవుతున్న ఫోటోలు!

Rajasaab movie trolls: ఈ సంక్రాంతికి భారీ అంచనాల నడుమ విడుదలై బోల్తా కొట్టిన ప్రభాస్(Rebel Star Prabhas) ‘రాజా సాబ్'(The Rajasaab Movie) చిత్రం పై సోషల్ మీడియా లో వచ్చినన్ని ట్రోల్స్ ఈమధ్య కాలం లో ఏ సినిమాపైన కూడా రాలేదు. ప్రభాస్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ తో ఇంత నాసిరకమైన సినిమా ఎలా తీసావు రా బాబు అంటూ ప్రతీ రోజు డైరెక్టర్ మారుతీ ని ట్యాగ్ చేసి తిడుతూనే ఉన్నారు అభిమానులు. ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే ఈ చిత్రం జియో హాట్ స్టార్ లోకి ఎంట్రీ ఇచ్చింది. హాట్ స్టార్ లోకి వచ్చిన తర్వాత నెటిజెన్స్ ఈ చిత్రం లోని తప్పులను ప్రతీ ఫ్రేమ్ లో కనిపెట్టేస్తున్నారు. అనేక సన్నివేశాల్లో ప్రభాస్ కాకుండా, ఆయన డూప్ ఈ చిత్రం లో నటించడాన్ని చూపించారు. ఒక్కమాటలో చెప్పలంటే ఈ సినిమాలో అసలు ప్రభాస్ నటించలేదు, కేవలం రెండు మూడు సన్నివేశాలు మాత్రమే చేశాడంటూ సెటైర్లు కురిపించారు నెటిజెన్స్.

ప్రభాస్ కెరీర్ లో ఎన్నో ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి కానీ, ఇలా ఆయన పరువు ని దారుణంగా తీసిన సినిమాలు మాత్రం లేవు. ఆ క్రెడిట్ ‘రాజా సాబ్’ ని తీసిన డైరెక్టర్ మారుతీ కే చెందుతుంది. వరుస ఫ్లాప్స్ లో ఉన్న ఆయనకు పిలిచి మరీ ప్రభాస్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అవకాశం ఇస్తే, ఇంత నిర్లక్ష్య ధోరణితో సినిమా చేయడాన్ని అభిమానులు అసలు తీసుకోలేకపోతున్నారు. ఇకపోతే రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన వర్కింగ్ స్టిల్ ఒకటి సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. ఈ వర్కింగ్ స్టిల్ లో అచ్చు గుద్దినట్టు హీరోయిన్ మాళవిక మోహనన్ వేసుకున్న దుస్తులతో ఒక అమ్మాయిని మనం చూడొచ్చు. సినిమాలో ఒక్క సన్నివేశం లో హీరోయిన్ మాళవిక మోహనన్ ఫైట్ చేస్తుంది గుర్తుందా?, ఆ ఫైట్ సన్నివేశం నిజంగా మాళవిక చేయలేదు, ఆమెకు బదులుగా ఈ అమ్మాయి చేసింది.

అంత చిన్న ఫైట్ షాట్ ని కూడా హీరోయిన్ చేయలేకపోయిందా?, ఇలా అన్ని డూప్ షాట్స్ తోనే ఈ సినిమాని లాగించేశారా?, ఇది కచ్చితంగా ‘రాజా సాబ్ ‘ సినిమా అయితే కాదు, ఇదొక ‘డూప్ సాబ్’ అంటూ అభిమానులు సైతం సెటైర్లు వేస్తున్నారు. ఇలా ఈ చిత్రం ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత రోజుకి ఒక విషయం బయటపడుతోంది. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ అభిమానులు ‘స్పిరిట్’ మూవీ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 5 న విడుదల కాబోతుంది. ఈ చిత్రం కంటే ముందు ప్రభాస్ నుండి ‘ఫౌజీ’ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version