Spirit Movie: ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో అభిమానులతో పాటు , ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘స్పిరిట్’. సందీప్ వంగ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై టాలీవుడ్ లోనే కాదు , బాలీవుడ్ ఆడియన్స్ లో కూడా క్రేజ్ భారీ రేంజ్ లో ఉంది. సందీప్ వంగ గతం లో బాలీవుడ్ లో తెరెకెక్కించిన ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ చిత్రాలు ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేశాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. యూత్ ఆడియన్స్ లో ఆయనకు కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రభాస్ కి కూడా నార్త్ ఇండియా లో మంచి క్రేజ్, ఫేమ్ ఉండడం తో , ‘స్పిరిట్’ చిత్రానికి సెన్సేషనల్ ఓపెనింగ్స్ వస్తాయనే బలమైన నమ్మకం తో ఉన్నారు బాలీవుడ్ ట్రేడ్ పండితులు. ఇకపోతే లేటెస్ట్ గా ఈ చిత్రం గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది.
ఇందులో ఒక కీలక పాత్ర కోసం ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ని రీసెంట్ గానే ఆ చిత్ర దర్శకుడు సందీప్ వంగ సంప్రదించినట్టు బాలీవుడ్ లో నడుస్తున్న టాక్. ఈ సినిమా షూటింగ్ కోసం ఆమె రెండు రోజుల కాల్ షీట్స్ మాత్రమే ఇచ్చిందట. అంతే ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ అనే విషయం అర్థం అవుతోంది. తక్కువ నిడివి ఉన్న పాత్ర అయినప్పటికీ కూడా సినిమా కథని ని వేరే లెవెల్ కి మలుపు తిప్పే పాత్ర కావడంతో , కత్రినా కైఫ్ క్షణం కూడా ఆలోచించకుండా ఈ సినిమా లో నటించడానికి ఒప్పుకున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ విషయాన్ని మూవీ టీం అధికారికంగా ప్రకటించనుంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే బాలీవుడ్ లో ఈ సినిమా రేంజ్ ఇంకా పెరుగుతుంది అనే చెప్పాలి.
ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి దిమిరి నటిస్తుండగా, విలన్స్ గా వివేక్ ఒబెరాయ్ , ఐశ్వర్య మీనన్ లు నటిస్తున్నారు. వీళ్ళందరికీ సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇప్పటికే విడుదల చేశారు మేకర్స్. వీటికి నెటిజెన్స్ నుండి , అభిమానుల నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేయడం పైనే ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటి వరకు 40 శాతం కి పైగా షూటింగ్ పూర్తి అయ్యినట్టు డైరెక్టర్ సందీప్ వంగ రీసెంట్ గా జరిగిన ఒక ఈవెంట్ లో చెప్పుకొచ్చారు. మార్చి 5 న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి అన్ని విధాలుగా రెడీ అవుతున్నారు సందీప్ వంగ. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ప్రభాస్ , తిరిగి రాగానే లేటెస్ట్ షెడ్యూల్ లో పాల్గొంటారని టాక్



