Homeఎంటర్టైన్మెంట్Ravi Teja OTT debut series: నాగ చైతన్య దారిలో రవితేజ..అమెజాన్ ప్రైమ్ లో సరికొత్త...

Ravi Teja OTT debut series: నాగ చైతన్య దారిలో రవితేజ..అమెజాన్ ప్రైమ్ లో సరికొత్త వెబ్ సిరీస్..పూర్తి వివరాలు ఇవే!

Ravi Teja OTT debut series: మన టాలీవుడ్ హీరోలు ఈమధ్య కాలం లో ఓటీటీ బాట పడుతున్నారు. సినిమాల్లో వచ్చే డబ్బులకంటే, ఓటీటీ లో వచ్చే డబ్బులు చాలా ఎక్కువ , దానికి తోడు ఓటీటీ ద్వారా నేషనల్ వైడ్ గా పాపులర్ కూడా అవ్వొచ్చు. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ ద్వారా సమంత అలాగే పాపులర్ అయ్యింది. అదే విధంగా ‘ఫర్జీ’ అనే వెబ్ సిరీస్ ద్వారా విజయ్ సేతుపతి కూడా నేషనల్ వైడ్ గా క్రేజ్ ని తెచ్చుకున్నాడు. తమ సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో రీచ్ కావాలని అనుకుంటే, ముందుగా ఓటీటీ ద్వారా నేషనల్ వైడ్ గా ఉన్న మూవీ లవర్స్ ని అలరించి, ఆ తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు తీసుకోవచ్చు అనే ప్లాన్ లో ఉన్నారు. ఇకపోతే రీసెంట్ గానే అక్కినేని నాగచైతన్య ‘దూత’ అనే వెబ్ సిరీస్ ద్వారా భారీ హిట్ ని అందుకున్నాడు.

నేషనల్ లెవెల్ లో ఈ వెబ్ సిరీస్ పెద్ద సెన్సేషన్ సృష్టించింది. త్వరలోనే రెండవ సీజన్ లో కూడా నటించబోతున్నాడు నాగ చైతన్య. ఆయన సక్సిస్ అయిన విధానం చూసి మాస్ మహారాజ రవితేజ కూడా త్వరలో ఓటీటీ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. త్వరలోనే ఆయన ఒక వెబ్ సిరీస్ ద్వారా అమెజాన్ ప్రైమ్ లో మన ముందుకు రాబోతున్నాడు. ఈ వెబ్ సిరీస్ కి డైరెక్టర్ ఎవరు, ఏ జానర్ మీద ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కిస్తున్నారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కేవలం రవితేజ మాత్రమే కాదు, ప్రముఖ యంగ్ హీరో అడవి శేష్ కూడా ఒక వెబ్ సిరీస్ చేయబోతున్నాడని టాక్. ఇది నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇది కూడా ఈ ఏడాది లోనే మొదలయ్యే అవకాశాలు ఉన్నాయట.

ఇక రీసెంట్ గానే ‘K ర్యాంప్’ తో సూపర్ హిట్ ని అందుకొని మంచి ఫార్మ్ లోకి వచ్చిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా అమెజాన్ ప్రైమ్ లో ఒక వెబ్ సిరీస్ చేయనున్నాడు. భరత్ కమ్మ దీనిని దర్శకత్వం వహిస్తాడట. తిరువూర్ కూడా ఈ చిత్రం లో కీలక పాత్ర పోషించనున్నారు. ఇలా జనాల్లో క్రేజ్ ఉన్న హీరోలందరూ ఒక్కసారిగా ఓటీటీ బాట పట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఇవి మన ముందుకు వచ్చేందుకు సమయం పట్టొచ్చు కానీ, ఎంటర్టైన్మెంట్ పరంగా మాత్రం విజువల్ ఫీస్ట్ లాగా ఉండబోతుంది అనొచ్చు. హాలీవుడ్ లో ఎప్పటి నుండో ఈ సంస్కృతి ఉంది. ఇప్పుడు చిన్నగా మన సౌత్ హీరోలు ఈ ట్రెండ్ కి శ్రీకారం చుడుతున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version