Prabhas – Trivikram : మాటలు మాంత్రికుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్… తను చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ముఖ్యంగా ప్రేక్షకులను థియేటర్ కి రప్పించడంలో త్రివిక్రమ్ కీలకపాత్ర వహిస్తున్నాడు. ఆయన బ్రాండ్ నేమ్ తో ఒక సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకులు ఆ సినిమాను చూసి హాయిగా నవ్వుకోవచ్చు అలాగే ఎంజాయ్ చేయొచ్చు అనే ధోరణిలో ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం ‘ఆదర్శ కుటుంబం ‘ అనే సినిమా చేస్తున్నాడు. వెంకటేష్ హీరో గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు కామెడీ సన్నివేశాలు కూడా పుష్కలంగా ఉండబోతున్నాయట. గతంలో ప్రభాస్ ను హీరోగా పెట్టి త్రివిక్రమ్ ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు.
కానీ అది కార్యరూపం దాల్చలేదు. ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా తర్వాత త్రివిక్రమ్ ప్రభాస్ తో సినిమా చేయాలి. కానీ అప్పటికే ప్రభాస్ లైనప్ పెద్దగా ఉండటంతో త్రివిక్రమ్ అతనితో చేయాల్సిన సినిమాను పక్కనపెట్టి అల్లు అర్జున్ తో ‘అలా వైకుంఠపురంలో’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకుంది.
మొత్తానికైతే త్రివిక్రమ్ – ప్రభాస్ కాంబినేషన్లో సినిమా వస్తే చూడాలని ప్రతి ఒక్కరు ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఇక వాళ్లనుకుంటున్నట్టుగానే త్రివిక్రమ్ – ప్రభాస్ కాంబినేషన్లో ఒక భారీ సినిమా తెరకెక్కబోతుందా? ప్రేక్షకులందరిని మెప్పించే విధంగా ఆ సినిమా ఉంటుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ప్రభాస్ మాత్రం పాన్ ఇండియా లెవెల్లో దూసుకెళ్తున్నాడు. త్రివిక్రమ్ సైతం ఎన్టీఆర్ తో ‘ద గాడ్ ఆఫ్ వార్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే భారీ రికార్డులను క్రియేట్ చేసి ప్రభాస్ తో సినిమా చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నారట. తను ఉన్నట్టుగానే అన్ని వర్కౌట్ అవుతాయా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ, స్పిరిట్ రెండు సినిమాలను చేస్తున్నాడు…
