Homeఎంటర్టైన్మెంట్Tollywood Re Release : ఆగస్టు లో మహేష్.. సెప్టెంబర్ లో పవన్.. అక్టోబర్ లో...

Tollywood Re Release : ఆగస్టు లో మహేష్.. సెప్టెంబర్ లో పవన్.. అక్టోబర్ లో ప్రభాస్.. గెలిచేది ఎవరో..

Tollywood Re Release : టాలీవుడ్ లో ఇప్పుడు ఆసక్తికరమైన పోరుకి తెరలేచింది. గత కొంతకాలం నుండి రీ రిలీజ్ ట్రెండ్ ఏ రేంజ్ లో కొనసాగుతుందో అందరికీ తెలిసిందే. ఈ ట్రెండ్ లో పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , ప్రభాస్ చిత్రాలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అయితే ఈ ముగ్గురు హీరోలకు సంబంధించిన అభిమానులు రీ రిలీజ్ ట్రెండ్ కింగ్ మా హీరోనే అంటూ కొట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే రికార్డ్స్ ఈ ముగ్గురికే ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అయితే ఈ ముగ్గురిలో ఎవరు తోపు అనేది ఒక క్లారిటీ రాబోయే మూడు నెలల్లో తేలిపోనుంది. ఆగస్టు 9 న మహేష్ బాబు పుట్టిన రోజు కాగా, సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ , అక్టోబర్ 23 న ప్రభాస్ పుట్టిన రోజులు. ప్రతీ ఏడాది లాగానే , ఈ ఏడాది కూడా ఈ ముగ్గురి హీరోల అభిమానులు వీళ్ళ పుట్టినరోజు ని ఒక పండుగ లాగా జరపనున్నారు.

అంతే కాకుండా మహేష్ పుట్టిన రోజు సందర్భంగా పోకిరి సినిమాని భారీ లెవెల్ లో రీ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్న మేకర్స్, పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున పంజా చిత్రాన్ని రీ రిలీజ్ చేయనున్నారు. ఇక ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్ లో ల్యాండ్ మార్క్ గా నిల్చిన మిర్చి చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూడు సినిమాలకు మంచి క్రేజ్ ఉంది , అభిమానులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని సక్సెస్ చేసేందుకు ఎదురు చూస్తున్నారు. ఈ మూడు సినిమాల్లో ఏ చిత్రానికి ఎక్కువ వసూళ్లు వస్తే , వాళ్ళని రీ రిలీజ్ కింగ్ గా భావిస్తాము అంటూ సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ‘పోకిరి’ చిత్రానికి ఎక్కువ వసూళ్లు వచ్చే అవకాశాలు కాస్త ఉన్నాయి.

ఎందుకంటే ఆగష్టు 9న ఈసారి ఆదివారం రాబోతుంది. సెలవు దినం రోజున పోకిరి లాంటి సినిమా ని రీ రిలీజ్ చేస్తే గ్రాస్ వసూళ్లు ఊహించడం కూడా కష్టమే. ఇక ఆ తర్వాత ఎక్కువ గ్రాస్ వసూళ్లు రాబట్టే ఛాన్స్ మిర్చి సినిమాకు ఉంది. ఎందుకంటే ఈ సినిమా శుక్రవారం రోజున విడుదల కాబోతుంది. వీకెండ్ కాబట్టి భారీ గ్రాస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక పంజా మూవీ విషయానికి వస్తే , ఇది బుధవారం రోజున విడుదల కాబోతుంది. పూర్తి స్థాయి వర్కింగ్ డే లో విడుదల కాబోతున్న సినిమా, పైగా ఫ్లాప్ మూవీ, ఆడియన్స్ ఏ మేరకు ఆదరిస్తారో అనే భయం కాస్త అభిమానుల్లో ఉంది. అయితే ఈ సవాళ్ళను దాటుకొని , ఈ చిత్రానికి అత్యధిక వసూళ్లు వస్తే మాత్రం , తెలుగు రాష్ట్రాలు ఇంకా పవన్ కళ్యాణ్ ఆధీనం లో ఉన్నట్టే అనుకోవాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version