Heroes : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలుగా వెలుగొందుతూ భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్స్ తీసుకుంటూ మంచి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. మరి చాలామంది దర్శకులు వాళ్ళతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నప్పటికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ హీరోలకు సరైన సక్సెస్ అయితే రావడం లేదు. మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తూ ప్రతి హీరో మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న క్రమంలో వాళ్ళు చేసిన సినిమాలు మాత్రం ఆశించిన మేరకు విజయాలను అందుకోలేకపోతున్నాయి. ఇక దానికి తోడుగా రీసెంట్ గా వచ్చిన సినిమాలు సైతం పెను ప్రభంజనాన్ని సృష్టిస్తున్న క్రమంలో ఇండస్ట్రీలో ఉంటున్న కొంతమంది హీరోలు మాత్రం ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోతున్నారు. గోపీచంద్ లాంటి నటుడు ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు దాటినప్పటికి ఆయన చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధిస్తూ నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. కానీ గత కొన్ని రోజుల నుంచి మాత్రమే ఆయనకు సరైన సక్సెస్ అయితే రావడం లేదు. దాదాపు 2014 వ సంవత్సరంలో వచ్చిన లౌక్యం సినిమా తర్వాత ఆయనకు సరైన సక్సెస్ అయితే రావడం లేదు. మరి ఇలాంటి సందర్భంలో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు. తద్వారా ఆయన కెరీర్ ని ఎలా నిలబెట్టుకోబోతున్నాడు అనే విషయంలో కూడా సరైన క్లారిటీ అయితే రావడం లేదు. ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు చాలా తక్కువ అనే చెప్పాలి.
Also Read : ఆ విషయం లో స్టార్ హీరోలను చూసి కుర్ర హీరోలు రిస్క్ చేస్తున్నారా..?
అలాగే భారీ రేంజ్ లో బడ్జెట్ కూడా పెట్టిస్తున్నాడు అయినప్పటికి ఆయన ఆ బడ్జెట్ ను రికవరీ చేసే ప్రయత్నం అయితే చేయలేకపోతున్నాడు. కారణం ఏదైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ లు ఉన్నవారికి మాత్రమే మంచి గుర్తింపైతే ఉంటుంది. మరి ప్రస్తుతానికి గోపీచంద్ మాత్రం ఫ్లాపుల్లో ఉన్నాడనే చెప్పాలి. ఇక నితిన్ లాంటి హీరో సైతం కెరియర్ మొదట్లో మంచి విజయాలను సాధించాడు.
ఇక ఆ తర్వాత వరుసగా 13 ఫ్లాప్ సినిమాలు వచ్చినప్పటికి ఇష్క్ (Ishq) సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత నుంచి ఇక మరోసారి ఆయనకు భారీ సక్సెస్ అయితే దక్కలేదనే చెప్పాలి. ఇక రీసెంట్ గా చేసిన ‘రాబిన్ హుడ్’ (Robin Hud) సినిమా కూడా అతనికి ఏమాత్రం సక్సెస్ ని కట్టబెట్టలేదు.
మంచి సినిమాలు చేసి నటుడిగా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది… మరి రాబోయే సినిమాలతో వీళ్ళు ఎలాంటి సక్సెస్ సాధిస్తారు. తద్వారా ఆయన మార్కెట్ ఏ రేంజ్ లో పెరగబోతుంది అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read : గడ్డం పెంచితేనే హిట్ వస్తుందంటున్న మరో స్టార్ హీరో…