Star Heroes : ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడంలో కొంతమంది మాత్రం వెనకబడి పోతున్నారు. వారసత్వంగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని ఫ్యామిలీ హీరోలైతే ఇప్పటి వరకు సరైన సక్సెస్ ని సాధించలేక డీలాపడిపోతున్నారు… ఇక మీదట వీళ్ళు చేయబోయే సినిమాలతో భారీ విజయాలను అందుకుంటే మాత్రం స్టార్ స్టేటస్ ని అందుకుంటారు లేకపోతే మాత్రం ప్లాప్ హీరోలుగా మారుతారు…
సినిమా ఇండస్ట్రీలో పాత కథలకు కాలం చెల్లిపోయింది. ఎప్పటికప్పుడు యంగ్ డైరెక్టర్స్ కొత్త కథలతో సినిమాలను చేస్తూ పాన్ ఇండియా రేంజ్ లో వాళ్ల సత్తాను చాటుకోవడమే కాకుండా ఇండస్ట్రీ హిట్లను సైతం నమోదు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఎప్పుడైతే రాజమౌళి (Rajamouli) బాహుబలి(Bahubali) సినిమాతో సంచలనాన్ని క్రియేట్ చేశాడో అప్పటినుంచి ఇప్పటివరకు పాన్ ఇండియా నేపథ్యంలోనే సినిమాలు చేస్తు సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్నాయి…ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా ఇక మీదట చేయబోయే సినిమాల కోసం చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నారు. ఇక ఇప్పుడు స్టార్ హీరోలందరూ రగ్గుడ్ లుక్ లో కనిపించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దానికోసమే వెంట్రకలు గడ్డం విపరీతంగా పెంచుకుంటూ సినిమాకు ఒక భారీ విజయాన్ని అందించాలనే ఉద్దేశంతో వాళ్ళ మేకవర్లో చాలా జాగ్రత్తలైతే తీసుకుంటున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇకమీదట చేయబోతున్న సినిమాలతో మరికొంతమంది స్టార్ హీరోలు సైతం అదే బాటలో నడుస్తుండడం విశేషం…ప్రస్తుతం అక్కినేని అఖిల్ సైతం ‘లెనిన్ ‘ సినిమాతో రగ్గుడ్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇక రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ అయితే రిలీజ్ చేశారు.
Also Read : రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరి సినిమా చేసి ఉంటే బాగుండేదా..?
ఈ గ్లింప్స్ అద్భుతంగా ఉన్నప్పటికి అఖిల్ కి ఈ సినిమా ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనే విషయం మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. నిజానికి అఖిల్ చాక్లెట్ బాయ్ లా చాలా క్యూట్ గా ఉంటాడు. కానీ ఒక్కసారిగా రగ్గుడ్ లుక్ లోకి మారిపోవడం చూసిన ప్రతి ఒక్కరూ అఖిల్ ని గుర్తుపట్టలేకపోతున్నాం అంటూ కామెంట్లు చేస్తూ ఉండటం విశేషం…
మరి ఏది ఏమైనా కూడా అక్కినేని ఫ్యామిలీ మూడోవ తరం నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఇప్పటివరకు చేసిన సినిమాలన్నింటితో ఒక్క సక్సెస్ ని కూడా సాధించలేకపోయాడు. ఆయన ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పది సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికి ఇప్పటివరకు సరైన సక్సెస్ లేకపోవడంతో ఆయన కెరియర్ ఎటువైపు వెళుతుంది అంటూ అక్కినేని అభిమానులు సైతం చాలా వరకు ఆందోళన చెందుతున్నారు.
మరి ఇలాంటి సందర్భంలో నాగార్జున కూడా అఖిల్ విషయంలో కొంతవరకు డిసప్పాయింట్ మెంట్ తో ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంతో ఇక మీదట చేసే సినిమాతో భారీ సక్సెస్ లను సాధించాలని చూస్తున్నాడు. ఆ రకంగానే నాగార్జున సైతం అఖిల్ కెరీర్ మీద ఫోకస్ చేసి ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : అల్లు అర్జున్ పుట్టినరోజుని పట్టించుకోని టాలీవుడ్ సెలబ్రిటీలు..!