Shreyas Iyer : ఎప్పుడైతే పంజాబ్ జట్టు యాజమాన్యం శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ను కొనుగోలు చేసిందో.. అప్పుడే ఆ జట్టు రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. మామూలు కాదు.. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్ జట్టు ఆరవ స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆ జట్టు నాలుగు మ్యాచ్లు అడగా.. కేవలం ఒకదాంట్లో మాత్రమే ఓడిపోయింది. గుజరాత్, లక్నో, చెన్నై వంటి బలమైన జట్లను ఓడించింది. రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది. పంజాబ్ జట్టులో ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్ సిమ్రాన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, నెహల్ వదేరా, శశాంక్ సింగ్ లాంటి ఆటగాళ్లు కీలకంగా ఉన్నారు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్, ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్ సిమ్రాన్ సింగ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నారు. శనివారం నాడు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ లోనూ వీరు ముగ్గురు అదరగొట్టారు. వీరి బ్యాటింగ్ ఫలితం.. చివర్లో స్టోయినిస్ అరాచకం సృష్టించడంతో హైదరాబాద్ జట్టు పై పంజాబ్ ఆరు వికెట్ల నష్టానికి 245 రన్స్ స్కోర్ చేసింది.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పంజాబ్ జట్టు హైయెస్ట్ స్కోర్ ఇదే కావడం విశేషం.
Also Raed : జేబులో పెట్టుకొని వచ్చి మరీ కొట్టాడు.. అభిషేకూ చూపించిన పేపర్లో ఏముందంటే..
ఒకసారి గా మారిపోయింది
ఈ సీజన్లో పంజాబ్ జట్టుకు రికీ పాంటింగ్ కోచ్ గా రావడంతో ఒక్కసారిగా రూపురేఖలు మారిపోయాయి. ఈ సీజన్లో పంజాబ్ జట్టు ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్లలో.. మూడింట్లో 200కు పైగా స్కోర్ చేసింది అంటే మాటలు కాదు. హైదరాబాద్ జట్టుపై 245/6, గుజరాత్ జట్టుపై 243/5, చెన్నై జట్టుపై 219/6 పరుగులు చేసింది. ఇక 2024లో కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడిన మ్యాచ్లో పంజాబ్ 262/2 రన్స్ స్కోర్ చేసింది. ఇప్పటివరకు ఆ జట్టుకు ఇదే హైయెస్ట్ స్కోర్ గా ఉంది. ఇక శనివారం సన్ రైజర్స్ హైదరాబాద్ టీం పై 245/6 స్కోర్ చేసేసింది.. ఇది పంజాబ్ జట్టుకు సెకండ్ హైయెస్ట్ స్కోర్ గా ఉంది. ఇక ఇదే సంవత్సరం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ 243/5 పరుగులు చేసింది. ఇది థర్డ్ హైయెస్ట్ స్కోర్ గా ఉంది. 2011లో ధర్మశాల వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుపై పంజాబ్ 232/2 పరుగులు చేసింది. ఇది ఫోర్త్ హైయెస్ట్ స్కోర్ గా ఉండే. కటక్ వేదికగా 2014లో చెన్నై జట్టుపై పంజాబ్ జట్టు 231/4 స్కోర్ చేసింది. ఇది ఫిఫ్త్ హైయెస్ట్ స్కోర్ గా ఉంది. అంటే ప్రతి సీజన్లోనూ పంజాబ్ జట్టు హైయెస్ట్ స్కోర్ ను పెంచుకుంటూ పోతుంది.. ఈ సీజన్లో ఇప్పటికే పంజాబ్ జట్టు మూడుసార్లు 200 పైగా పరుగులు చేయడం విశేషం. అది కూడా బలమైన హైదరాబాద్, గుజరాత్, చెన్నై జట్లపై చేయడం విశేషం.
Also Read : శ్రేయస్ అయ్యర్ భయ్యో.. నీ పొలంలో మొలకలు వచ్చాయి.. ఇక పండగే పో..