Heroes : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలందరు భారీ సక్సెస్ ను సాధించడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. గత 5 సంవత్సరాల ముందు వరకు ప్రభాస్(Prabhas), మహేష్ బాబు (Mahesh Babu), రామ్ చరణ్ (రామ్ Chara), ఎన్టీఆర్ (NTR) లాంటి హీరోలకే మాస్ లో మంచి గుర్తింపు ఉండేది. దాని వల్ల వల్ల నుంచి వచ్చే మాస్ సినిమాలను చూడటానికి యావత్ తెలుగు ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉండేవారు. కానీ ఈ మధ్య కాలంలో పుష్ప(Pushpa ) సినిమాతో అల్లు అర్జున్ (Allu Arjun) మాస్ సినిమాను చేసి మాస్ హీరోగా మారిపోయాడు. ఇక అతని బాటలోనే నాచురల్ స్టార్ గా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న నాని(Nani) సైతం భారీ గుర్తింపును సంపాదించుకోవడానికి దసర (Dasara) తో మాస్ అవతారమెత్తాడు… ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాకుండా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును కూడా తెచ్చుకున్నాడు…ఇక ఇప్పుడు మరోసారి ఆయన శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) డైరెక్షన్ లో ప్యారడైజ్ (Paradaise) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి డిఫరెంట్ గెటప్ లో కనిపిస్తున్నాడు. ఇక రామ్ చరణ్ సైతం ఇంతకు ముందు రంగస్థలం (Rangasthalam) సినిమాలో రగ్గుడ్ గా కనిపించి సక్సెస్ సాధించాడు.
Also Read : గడ్డం పెంచితేనే హిట్ వస్తుందంటున్న మరో స్టార్ హీరో…
ఇక ఇప్పుడు మరోసారి పెద్ది (Peddi) సినిమాతో సూపర్ సక్సెస్ ను సాధించడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఇప్పుడు వీళ్ళ బాట లోనే మెగా మేనల్లుడు అయిన సాయి ధరమ్ తేజ్ సైతం ‘సంబరాల ఏటిగట్టు ‘ అంటూ ఒక మాస్ సినిమా చేస్తున్నాడు…ఇక వీళ్ళతో పాటుగా అక్కినేని అఖిల్ కూడా ‘లెనిన్ ‘ సినిమాతో మాస్ హీరోగా మారే ప్రయత్నం చేస్తున్నాడు.
రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుంది అంటూ మేకర్స్ భారీ నమ్మకాన్ని పెట్టుకున్నారు…ఇక ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ కూడా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది…ఇక వీళ్ళు కూడా మిగతా హీరోల మాదిరిగానే స్టార్ హీరోలుగా మారతారా లేదంటే భారీ డిజాస్టర్లను మూటగట్టుకుంటారా అనేది తెలియాల్సి ఉంది…
ఇప్పటి వరకు ఇండస్ట్రీ లో ఎంత మంది హీరోలు ఉన్నా కూడా మాస్ హీరోలకు మాత్రమే మంచి క్రేజ్ ఉంటుంది. అలాగే వాళ్లకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అందువల్లే ప్రతి ఒక్కరు మాస్ హీరోగా మారాలని చూస్తూ ఉంటారు…మరి ఈ కుర్ర హీరోలు కూడా మాస్ సినిమాలతో వాళ్ల సత్తా చాటుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Also Read : తెలుగు సినిమా ఇండస్ట్రీ భవిష్యత్ స్టార్ హీరోల చేతుల్లోనే ఉందా..?