spot_img
Homeఎంటర్టైన్మెంట్The Odyssey Box Office : 'ది ఒడిస్సీ' 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.....

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల నుండి ఇంత గ్రాస్ ఊహించలేదు..

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘ది ఒడిస్సీ’ బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6 రోజులైంది, ఇప్పటికీ కలెక్షన్స్ చాలా స్టడీ గా ఉన్నాయి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ చిత్రానికి కేవలం 6 రోజుల్లోనే ఇండియా వైడ్ గా 11 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట. అంటే మన ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం 106 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు అన్నమాట. నిన్న కూడా ఈ చిత్రానికి ఇండియా వైడ్ గా 6 కోట్ల 89 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయట. ఇది సాధారణమైన విషయం కాదు. ఓవరాల్ గా ఇండియా వైడ్ వచ్చిన నెట్ వసూళ్లు 79 కోట్ల రూపాయిలు , ఈ వీకెండ్ తో 100 కోట్ల మార్కుని కూడా అందుకోనుంది ఈ చిత్రం.

ఇకపోతే తెలుగు రాష్ట్రాల నుండి కూడా ఈ చిత్రానికి సెన్సేషనల్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఒక్క తెలంగాణ ప్రాంతం నుండే ఈ చిత్రానికి 6 రోజుల్లో 11 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ నుండి 4 కోట్ల 77 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు సమాచారం. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 15 కోట్ల 77 లక్షలు అన్నమాట. ఒక ఇంగ్లీష్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఈ రేంజ్ గ్రాస్ రావడం చిన్న విషయం అయితే కాదు. అదే విధంగా ఇతర సౌత్ రాష్ట్రాల విషయానికి వస్తే , కర్ణాటక రాష్ట్రము నుండి 17 కోట్ల 57 లక్షలు రాగా, తమిళనాడు రాష్ట్రం నుండి 9 కోట్లు , కేరళ నుండి 6 కోట్ల 58 లక్షలు వచ్చినట్టు సమాచారం.

ఓవరాల్ వరల్డ్ వైడ్ గా గ్రాస్ వసూళ్లు 3000 కోట్ల రూపాయిలు వచ్చినట్టు తెలుస్తోంది. అమెరికన్ డాలర్స్ లెక్కల్లోకి చూస్తే 400 మిలియన్ డాలర్లకు చాలా దగ్గరగా ఉంది ఈ చిత్రం. ఇదే తరహా థియేట్రికల్ రన్ కొనసాగితే , కచ్చితంగా ఈ చిత్రం ప్రతిష్టాత్మక 1 బిలియన్ మార్కును ని అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఈ వీకెండ్ నమోదు అయ్యే వసూళ్లతో ఈ సినిమా 1 బిలియన్ మార్కుని అందుకుంటుందా లేదా అనే విషయం పై క్లారిటీ వస్తుంది. అదే విధంగా ఈ నెలాఖరున స్పై డర్ మ్యాన్ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రభావం కూడా ‘ది ఒడిస్సీ’ చిత్రం పై పడే అవకాశాలు ఉన్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Wrong Mobile Recharge : తప్పుడు నెంబర్కు రీఛార్జ్ చేశారా.. ఇలా చేస్తే మనీ రిఫండ్..

Wrong Mobile Recharge : మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎవరికి వారే రీఛార్జ్ చేసుకుంటూ ఉంటున్నారు. అయితే ఈ క్రమంలో ఒక్కోసారి తప్పుడు నెంబర్ పై రీఛార్జ్ అయ్యే అవకాశం...

IBPS PO 2026 : బ్యాంకు ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. 7,460 ఉద్యోగాలకు మరో ఛాన్స్‌!

IBPS PO 2026 : ఐబీపీఎస్‌(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌) పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీవో), స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌(ఎస్‌వో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ý డువు...
Lenin 10 Days Collection

Lenin Movie : ‘లెనిన్’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. కొత్త సినిమాలు వచ్చినా జోరు తగ్గలేదు..

Lenin Movie : అఖిల్ 'లెనిన్' చిత్రం బాక్స్ ఆఫీస్ జోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా విడుదలై 13 రోజులైనప్పటికీ కూడా, కొన్ని సెంటర్స్ లో నేటికీ కూడా భారీ...
Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Oktelugu Epaper