Homeఎంటర్టైన్మెంట్The Odyssey Day 1 Collection: 'ది ఒడిస్సీ' వసూళ్ల సునామీ.. మొదటి రోజు వచ్చిన...

The Odyssey Day 1 Collection: ‘ది ఒడిస్సీ’ వసూళ్ల సునామీ.. మొదటి రోజు వచ్చిన గ్రాస్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు..

The Odyssey Day 1 Collection: క్రిస్టోఫర్ నోలన్ సినిమాలంటే పశ్చిమ దేశాలకు చెందిన మూవీ లవర్స్ కి మాత్రమే కాదు , మన ఇండియన్ మూవీ లవర్స్ కి కూడా పిచ్చి అనే చెప్పాలి. ముఖ్యంగా మన తెలుగు యువత అయితే నోలన్ సినిమా వస్తుందంటే చాలు , క్యూలు కట్టేస్తుంటారు. నిన్న ఆయన దర్శకత్వం లో తెరకెక్కిన ‘ది ఒడిస్సీ’ అనే చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదలైంది. మన తెలుగు లో […]

The Odyssey Day 1 Collection: క్రిస్టోఫర్ నోలన్ సినిమాలంటే పశ్చిమ దేశాలకు చెందిన మూవీ లవర్స్ కి మాత్రమే కాదు , మన ఇండియన్ మూవీ లవర్స్ కి కూడా పిచ్చి అనే చెప్పాలి. ముఖ్యంగా మన తెలుగు యువత అయితే నోలన్ సినిమా వస్తుందంటే చాలు , క్యూలు కట్టేస్తుంటారు. నిన్న ఆయన దర్శకత్వం లో తెరకెక్కిన ‘ది ఒడిస్సీ’ అనే చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదలైంది. మన తెలుగు లో కూడా ఈ చిత్రం థియేటర్స్ లో విడుదలైంది. అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు మన ఇండియన్ ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓపెనింగ్స్ కళ్ళు చెదిరే రేంజ్ లో ఉన్నాయి. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 20 వేలకు పైగా టిక్కెట్స్ అమ్ముడుపోతున్నాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి మొదటి రోజు ఎంత గ్రాస్ వచ్చిందో ఒకసారి చూద్దాం.

ఈ చిత్రానికి కేవలం ఒక్క నార్త్ అమెరికా లోనే ప్రీమియర్స్ + మొదటి రోజు కలిపి 50 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రీమియర్ షోస్ నుండి 17.6 మిలియన్ డాలర్ల గ్రాస్ రాగా, మొదటి రోజు 2 గంటల సమయానికి 23.3 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఓవరాల్ గా మొదటి రోజు షోస్ పూర్తి అయ్యేసరికి ఈ చిత్రం నార్త్ అమెరికా నుండి 50 మిలియన్ డాలర్లు రాబట్టినట్టు సమాచారం. అదే విధంగా యూరోప్ ఖండంలో కూడా ఈ చిత్రం దుమ్ము దులిపేసింది అనే చెప్పొచ్చు. కేవలం ఇటలీ నుండే ఈ చిత్రానికి మొదటి రోజున 2.5 మిలియన్ డాలర్ల గ్రాస్ నమోదు అయ్యిందట. ఇక మన ఇండియన్ మూవీ లవర్స్ అయితే ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టేశారు.

ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి మొదటి రోజున ఇండియా వైడ్ గా అన్ని భాషలకు కలిపి 20 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి వచ్చిన వసూళ్లు , ఇండియన్ కరెన్సీ లెక్కల్లో చూస్తే 415 కోట్ల రూపాయిల గ్రాస్ అట. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే , ఆంధ్ర ప్రదేశ్ నుండి ఈ చిత్రానికి 1 కోటి 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, తెలంగాణ ప్రాంతం నుండి 2 కోట్ల 43 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక రాష్ట్రము లో 3 కోట్ల 53 లక్షలు రాగా , తమిళనాడు నుండి 1 కోటి 85 లక్షలు , కేరళ నుండి 1 కోటి 32 లక్షల రూపాయిలు వచ్చాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper