Homeఎంటర్టైన్మెంట్The Odyssey Box Office : 'ది ఒడిస్సీ' 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.....

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇదేమి మాస్ విధ్వంసం సామీ..

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ‘ది ఒడిస్సీ’ చిత్రం రీసెంట్ గానే ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేయగా , ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం కళ్ళు చెదిరే ఓపెనింగ్ వసూళ్లను సొంతం చేసుకుంది. బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు […]

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ‘ది ఒడిస్సీ’ చిత్రం రీసెంట్ గానే ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేయగా , ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం కళ్ళు చెదిరే ఓపెనింగ్ వసూళ్లను సొంతం చేసుకుంది. బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు 20 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, రెండవ రోజున 24 కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా రెండు రోజులకే 44 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 36 కోట్ల 72 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. ఒక హాలీవుడ్ సినిమాకు ఈ రేంజ్ గ్రాస్ మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద రావడం చిన్న విషయం అయితే కాదు.

ఇక నార్త్ అమెరికా విషయానికి వస్తే 2 వ రోజున ఈ చిత్రం ఆ ప్రాంతం నుండి 40.75 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిందట . ఓవరాల్ గా రెండు రోజుల్లో ఈ చిత్రానికి నార్త్ అమెరికా లో 91.46 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద రెండు రోజుల్లో వచ్చిన వసూళ్లను అమెరికన్ డాలర్స్ కి మారిస్తే 5 మిలియన్ డాలర్లు అవుతుంది. ఇక ఆ తర్వాత యూరోప్ , ఇతర పశ్చిమ దేశాల నుండి వచ్చే వసూళ్లను కలిపితే ఈ చిత్రానికి రెండు రోజుల్లో 170 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయని , ఓవరాల్ గా ఇండియన్ కరెన్సీ లెక్కల్లో చూస్తే 1400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

అయితే ఈ చిత్రం ఇప్పుడు ప్రతిష్టాత్మక బిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరుతుందా లేదా అని అంచనాలు వేసుకుంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి మొదటి వీకెండ్ లో 258 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు గ్లోబల్ వైడ్ గా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయట. ఈ రేంజ్ ట్రెండ్ ఉంది కాబట్టి , ఓవర్సీస్ లో హాలీవుడ్ సినిమాలకు నెలల తరబడి లాంగ్ రన్ ఉంటుంది కాబట్టి, కచ్చితంగా 1 బిలియన్ డాలర్ల గ్రాస్ మార్కుని అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. వర్కింగ్ డేస్ లో ఈ చిత్రానికి ఏ రేంజ్ గ్రాస్ వసూళ్లు రాబోతున్నాయి చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper