jana nayagan movie delay : తమిళ హీరో విజయ్(Thalapathy Vijay) నటించిన ‘జన నాయగన్'(Jana Nayagan) మూవీ పరిస్థితి రోజురోజుకి దయనీయంగా మారింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9 న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల చెయ్యాలని అనుకున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ ని కూడా మొదలు పెట్టారు. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ చిత్రానికి 50 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు కూడా వచ్చాయి. అంతా పర్ఫెక్ట్ గా సాగుతుంది, విజయ్ కెరీర్ లో మరో 100 కోట్ల ఓపెనింగ్ ని రాబట్టిన సినిమా అవుతుందని అంతా అనుకున్నారు. కానీ సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించింది. సమాజం లో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఈ సినిమాలో చాలా సన్నివేశాలు ఉన్నాయని , వాటిని తొలగిస్తేనే సర్టిఫికేట్ ఇస్తామని చెప్పుకొచ్చింది. అందుకు నిర్మాతలు ఒప్పుకోలేరు, కోర్టు వరకు వెళ్లారు.
కోర్టు కూడా ఆ సన్నివేశాలను తొలగించాల్సిందే అని తీర్పు ని ఇవ్వడం తో, ఇక చేసేది ఏమి లేక కేసు ని వెనక్కి తీసుకొని సెన్సార్ బోర్డు మెంబెర్స్ సూచించిన సన్నివేశాలను తొలగించడానికి సిద్ధమయ్యారు మేకర్స్. రీసెంట్ గానే మూవీ ఎడిటెడ్ కట్ ని రివైజింగ్ కమిటీ కి కూడా పంపారు. నేడు ఈ సినిమాని CBFC రివైజింగ్ కమిటీ కి సంబంధించిన సభ్యులు ఈ చిత్రాన్ని చూడాల్సి ఉంది. అయితే కమిటీ లో ఒక సభ్యుడు అనారోగ్యానికి గురు అవ్వడంత చివరి నిమిషం లో ఈ కార్యక్రమం వాయిదా పడింది. మళ్లీ ఎప్పుడు ఈ చిత్రాన్ని చూస్తారో డేట్ కూడా చెప్పకపోవడం తో ఈ సినిమా విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉన్న చిక్కుముడులు వీడితే ఈ చిత్రాన్ని ఫిబ్రవరి నెలలో విడుదల చెయ్యాలని మూవీ టీం భావించింది. కుదరకపోవడం తో ఆపర్ల నెలలో అయినా విడుదల చెయ్యాలని అనుకుంది. ఇప్పుడు అది కూడా సాధ్యం అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు.
జూన్ 22 న విజయ్ పుట్టిన రోజు కావడం తో, ఆ రోజు అయినా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావాలని అనుకుంటున్నారు. కనీసం ఇదైనా సాధ్యం అవుతుందో లేదో చూడాలి. అప్పటికీ తమిళనాడు లో సార్వత్రిక ఎన్నికలు కూడా పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో TVK పార్టీ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పార్టీ పెర్ఫార్మన్స్ ని బట్టి సినిమాకు వచ్చే వసూళ్లు కూడా ఆధారపడి ఉంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. ప్రస్తుతం విజయ్ వృత్తిపరంగా మాత్రమే కాదు, వ్యక్తిగతంగా కూడా ఎలాంటి ఆరోపణలు ఎదురుకుంటున్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. సాఫీగా పీక్ రేంజ్ లో సాగిపోతున్న కెరీర్ ని విజయ్ అనవసరం గా వదిలి ఈ రాజకీయాల్లోకి వచ్చాడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.