Tamannaah: గత కొద్దీ రోజుల నుండి సోషల్ మీడియా లో యూత్ మొత్తం తమన్నా నామస్మరణం చేస్తున్నారు. సౌత్ లో టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో ఒకరిగా రెండు దశాబ్దాల నుండి కొనసాగుతున్న ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ లో హల్చల్ చేస్తుంది. రీసెంట్ గా ఆమె నటించిన రెండు వెబ్ సిరీస్ లు ‘జీకర్డా’ మరియు ‘లస్ట్ స్టోరీస్ 2 ‘ అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి. ముఖ్యంగా ఈ రెండు సిరీస్ లలో తమన్నా చేసిన బోల్డ్ హాట్ రొమాన్స్ కుర్రకారులకు మెంటలెక్కిపోయేలా చేస్తుంది.
సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన ఆమె రొమాన్స్ రొమాన్స్ కి సంబంధించిన వీడియోలు మరియు ఫొటోలే కనిపిస్తున్నాయి. ఇంత బోల్డ్ గా తమన్నా తన కెరీర్ లో ఎప్పుడూ కూడా చెయ్యలేదు, ఇదే మొట్టమొదటిసారి అని చెప్పొచ్చు. ముద్దు సన్నివేశాలకు మొదటి నుండి దూరం గా ఉంటూ వచ్చిన తమన్నా లో ఈ రేంజ్ రొమాంటిక్ యాంగిల్ ఉందని ఎవ్వరూ ఊహించలేకపోయారు.
ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఈమె ప్రముఖ యంగ్ హీరో విజయ్ దేవరకొండ పై కొన్ని హాట్ కామెంట్స్ చేసింది. గతం లో ఆహా మీడియా ఛానల్ లో సమంత వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘సామ్ జామ్’ ప్రోగ్రాం కి ఒక గెస్ట్ గా విచ్చేసిన తమన్నా ని సమంత ఒక ప్రశ్న అడుగుతూ ఏ హీరో తో నువ్వు లిప్ కిస్ చెయ్యడానికి ఇష్టపడుతావు అని అడగగా, దానికి తమన్నా సెకండ్ కూడా ఆలోచించకుండా విజయ్ దేవరకొండ పేరు చెప్పేస్తుంది.
రీసెంట్ గా కూడా ఒక బాలీవుడ్ ఇంటర్వ్యూ లో విజయ్ దేవరకొండ తో రొమాన్స్ చెయ్యాలి అనేది నా డ్రీం, ఇప్పటి వరకు ఆ డ్రీం నెరవేరలేదు, భవిష్యత్తులో నెరవేరుతుందో లేదో చూడాలి అంటూ సంచలన కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తున్నాయి.