Tamannaah Bhatia Lust Stories 2 : అప్పుడెప్పుడో 2005లో మంచు మనోజ్ హీరోగా వచ్చిన శ్రీ సినిమా ద్వారా తెలుగు చిత్రపరిషణకు తమన్నా భాటియా పరిచయమైంది.. అప్పటినుంచి ఇప్పటిదాకా తెలుగు చిత్ర పరిశ్రమలో రాణిస్తోంది అంటే మామూలు విషయం కాదు. చిరంజీవి మొదలుకొని నాగచైతన్య వరకు అందరితోనూ ఆడి పాడింది. బాహుబలి వంటి చారిత్రాత్మక చిత్రంలోనూ నటించింది. ఇంతటి సుదీర్ఘ కెరియర్ లోనూ ఎక్కడా కూడా హద్దులు దాటలేదు. అందాలు ఆరుబోయలేదు. ఎటువంటి వివాదాల్లోనూ తల దూర్చలేదు. సింపుల్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్ళింది. తెలుగు చిత్ర పరిశ్రమలో అజాతశత్రువుగా పేరు గడించింది. మిల్కీ బ్యూటీగా వినతికెక్కింది. అలాంటి తమన్నా ఇప్పుడు హద్దులు దాటేస్తోంది. సుదీర్ఘ కెరియర్లో ఎన్నడూ లేని విధంగా రెచ్చిపోతోంది.
గతంలో తమన్నా బోల్డ్ సన్నివేశాల్లో నటించలేదు. స్కిన్ షో చేయలేదు. తన మిల్కీ వైట్ తోనే గ్లామర్ ప్రదర్శించింది. ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అలాంటి తమన్నా ఇంతవరకూ లవ్ లో పడలేదు. కానీ మొన్న “ఎంసీఏ” విలన్ విజయ్ వర్మతో కలిసి కనిపించింది. మొదట ఏదో యాక్సిడెంటల్ గా అని అందరూ అనుకున్నారు. తరచూ కనిపిస్తుండడంతో అందరూ కూడా ఒక అంచనాకొచ్చారు. తర్వాత ఇదే విషయాన్ని తమన్నా కుండబద్దలు కొట్టింది. తను విజయ్ వర్మతో లివింగ్ లైఫ్ రిలేషన్ షిప్ లో ఉన్నానని వెల్లడించింది..” లస్ట్ స్టోరీస్_2″ నుంచే తాము దగ్గరయ్యామని వివరించింది. వాళ్లు ఎంత దగ్గరయ్యారో తాజాగా విడుదలైన ఆ వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది..
ఇటీవల విడుదలైన జి కర్దా వెబ్ సిరీస్ లో తమన్నా ఒక రేంజ్ లో స్కిన్ షో చేసింది. బూతు సన్నివేశాలు, బూతు మాటలతో మనం చూస్తున్నది తమన్నా నేనా అనేంతలా గీత దాటేసింది.. కెరియర్ చివరి దశలోకి వచ్చిందో ఏమో మరి? లేదంటే డబ్బు కోసమే ఇదంతా చేస్తోందా అనే సందేహం వస్తోంది. నెట్ ప్లిక్స్ లో “లస్ట్ స్టోరీస్” ఒక సంచలనం.. శృంగారం, దానికి సంబంధించిన ద్వంద్వార్ధపు మాటలను నేరుగా మాట్లాడడం అప్పట్లో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా రెండవ భాగాన్ని తీసుకొస్తున్నారు. జూన్ 29 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమ్ కానుంది. ఈ సిరీస్ ట్రైలర్ తాజాగా విడుదల చేశారు. తొలి భాగాన్ని పోలినట్టే ఇందులోనూ పలు పాత్రలు ఉన్నాయి. పెళ్లి చేసుకోబోయే జంట, ఓ వివాహిత, ఓ మధ్య వయసు జంట, ఓ సింగిల్ అమ్మాయి, ఓ పనిమనిషి పాత్రులు ఇందులో కీలకంగా కనిపిస్తున్నాయి. ఆర్. బాల్కీ, కొంకన్ సేన్ శర్మ, సుజోయ్ ఘోష్, అమిత్ రవీంద్రనాథ్ శర్మ నాలుగు ఎపిసోడ్స్ కు దర్శకత్వం వహించారు.
ఇక నటుడు విజయ్ వర్మతో రిలేషన్ షిప్ లో ఉన్నారని ప్రకటించిన తమన్నా.. ఈ సిరీస్ షూటింగ్ సమయంలోనే వారిద్దరూ ప్రేమలో పడ్డారు. రియల్ కపుల్ కాస్త రీల్ పైనా రెచ్చిపోయారు. ఈ సిరీస్ లో విజయ్ పాత్రకు అంతకుముందే పెళ్లి అవుతుంది. అయినప్పటికీ తమన్నా పాత్రతో రిలేషన్ పెట్టుకుంటాడు. ఈ బంధం చివరి వరకు ఏమైందో తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే. ఈ సిరీస్ లో అగ్నిపర్వతం, టెస్ట్ డ్రైవ్ పదాలతో విపరీతమైన ద్వంద్వార్థపు మాటలు ఉన్నాయి. ట్రైలర్ లేదా సిరీస్ చూడాలి అనుకుంటే మాత్రం కుటుంబంతో అస్సలు వద్దు. ఎందుకంటే ఇది జీ కర్దాను మించి ఉంది.