Guntur Karam movie : కొంత షూటింగ్ కూడా చేశాక పూజా హెగ్డే గుంటూరు కారం మూవీ నుండి తప్పుకుంది. ఇది ఊహించని పరిణామం. పూజా హెగ్డేకు ఈ మూవీ చాలా కీలకం. ఆమె వరుస పరాజయాల్లో ఉన్నారు. గుంటూరు కారం బ్రేక్ ఇస్తుందని ఆమె ఆశలు పెట్టుకున్నారు. అలాంటి పూజా హెగ్డే ఈ ఆఫర్ ఎందుకు వద్దన్నారనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో ఓ వాదన తెరపైకి వచ్చింది. తన చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా ఉండటం ఇష్టం లేని మహేష్ బాబు పూజా హెగ్డేను వేధింపులకు గురి చేశాడట. పొమ్మనకుండా పొగబెట్టాడట.
పలు కారణాలు చూపుతూ పూజా హెగ్డేకు చుక్కలు చూపించాడట. దాంతో పూజా హెగ్డే తీసుకున్న అడ్వాన్స్ తిరిగి నిర్మాతలకు ఇచ్చేసి, ప్రాజెక్ట్ నుండి తప్పుకుందట. ఎలాంటి అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది. ఈ పుకార్లను కొందరు కొట్టిపారేస్తున్నారు. రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కెరీర్లో మహేష్ పై ఎలాంటి ఆరోపణలు రాలేదు. ఒక్క హీరోయిన్ కూడా ఆయన గురించి తప్పుగా మాట్లాడిందిలేదు.
కాబట్టి ఇది కేవలం పుకారు మాత్రమే. పూజా హెగ్డేను దర్శక నిర్మాతలే తప్పించారంటున్నారు. మహేష్ ప్రవర్తన వలనే పూజా హెగ్డే గుంటూరు కారం మూవీ నుండి తప్పుకున్నారనడంలో నిజం లేదంటున్నారు. ఇక పూజా స్థానంలో దర్శకుడు త్రివిక్రమ్ ఎవరిని తీసుకుంటారనే చర్చ మొదలైంది. వరుస విజయాలతో జోరుమీదున్న సంయుక్త మీనన్ కి ఛాన్స్ ఇచ్చే అవకాశం కలదంటున్నారు. శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
చెప్పాలంటే ఇది పూజాకు ఊహించని షాక్. ఆమెను బ్యాడ్ లక్ వెంటాడుతుందనడానికి నిదర్శనం. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ని కూడా మార్చేశారనే వాదన వినిపిస్తోంది. ఇక మొదటి నుండి గుంటూరు కారం మూవీ చిత్రీకరణ సజావుగా సాగడం లేదు. ఆలస్యంగా మొదలైన ప్రాజెక్ట్ షూటింగ్ మరింత ఆలస్యం అవుతుంది. జూన్ 12న కొత్త షెడ్యూల్ మొదలు కావాల్సి ఉండగా నటుల డేట్స్ అడ్జెస్ట్ కాగా జులై కి వాయిదా వేశారు. గుంటూరు కారం సంక్రాంతికి రావడం కష్టమే అంటున్నారు.