Surekhavani: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటులు వాళ్లకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం అహర్నిశలు కష్టపడుతూ సినిమాల్లో మంచి గుర్తింపు రావడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు.ఇలాంటి క్రమం లో కొంత మంది నటులు స్టార్ నటులు గా గుర్తింపు పొందుతూ వస్తున్నారు. ఇక మరి కొందరు మాత్రం సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకుంటారు. ఇక అలాంటి వారిలో సురేఖ వాణి ఒకరు. ఈమె సినిమాల్లో అక్క పాత్రల్లో, వదిన పాత్రల్లో నటించి నటి గా మంచి గుర్తింపుని తెచ్చుకుంది ముఖ్యంగా ఈమె చేసిన సినిమాల్లో బొమ్మరిల్లు,భద్ర లాంటి సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఈ క్రమంలో సురేఖ వాణి కరొనా సమయంలో సోషల్ మీడియా లో విపరీతమైన హల్చల్ చేస్తూ అభిమానులని అలరిస్తూ వచ్చింది.
సోషల్ మీడియాలో తన కూతురు అయిన సుప్రీతతో కలిసి చిన్నచిన్న డ్రెస్సులు వేసుకొని డ్యాన్స్ లు చేస్తూ చాలా మంచి పాపులారీటి ని సంపాదించుకుంది. అయినప్పటికీ చాలామంది అభిమానులు నెగిటివ్ కామెంట్స్ పెడితే అలా కామెంట్స్ పెట్టిన వాళ్ల మీద రియాక్ట్ అయి వాళ్ళ మీద కేసు లు కూడా పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఇలాంటి క్రమంలో ఆమె దసరా పండుగ రోజున మెడలో తాళిబొట్టు వేసుకొని కనిపించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.
నిజానికి సురేఖ వాణి భర్త సురేష్ తేజ 2019 వ సంవత్సరంలో అనారోగ్యం కారణంగా చనిపోవడం జరిగింది. ఇక అప్పటి నుంచి తన కూతురు, తను ఇద్దరు కలిసి జీవిస్తున్నారు. అయినప్పటికీ ఆమె సినిమాలో అవకాశాలు వచ్చినప్పుడు నటిస్తూ నటి మంచి గుర్తింపు సంపాదించుకుంటూ వస్తుంది. మునపటి తో పోల్చుకుంటే ఇప్పుడు ఆమెకు సినిమాల్లో కొన్ని అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. అయితే రీసెంట్ గా దసరా రోజు మెడలో తాళిబొట్టుతో కనిపించిన సురేఖ వాణి గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అభిమానులు మళ్ళీ పెళ్లి చేసుకున్నావా సురేఖ వాణి అంటూ కామెంట్ చేయగా మరికొందరు మాత్రం ఏదైనా షో కి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని ఉన్నట్టున్నారు అందుకే అలాంటి వేషధారణలో ఫోటో దిగి సోవిదో మీడియా వేదికగా మనతో పంచుకున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఏది ఏమైనా కూడా సురేఖవాణి తరచూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన విషయాలను షేర్ చేసుకోవడం అనేది నిజంగా గ్రేట్ అని చెప్పాలి.ఇక సురేఖ వాణి మంచైనా, చెడైనా మొత్తం సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకుంటూ వస్తున్నారు.దాని ద్వారానే ఆమె ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణని అందుకుంటున్నారు…
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Surekhavani surprised everyone when she was seen thaali around her neck on the day of dussehra
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com