spot_img
Homeఎంటర్టైన్మెంట్Srinidhi Shetty: పాన్ ఇండియా హిట్ కొట్టినా.. పాపం, పాపకు కలిసి రావడం లేదు

Srinidhi Shetty: పాన్ ఇండియా హిట్ కొట్టినా.. పాపం, పాపకు కలిసి రావడం లేదు

Srinidhi Shetty: హీరోకి లేని గొప్ప అవకాశం హీరోయిన్ కి ఉంటుంది. ఒక హీరో ఎంత పెద్ద స్టార్ అయినా.. ఒక భాషకి చెందిన సినిమాలనే చేసుకుంటూ పోవాలి. అన్నీ భాషల్లో అంతే స్టార్ డమ్ తో సినిమాలు చేసుకుంటూ వెళ్లడం ఏ హీరోకి సాధ్యం కాదు. అదే హీరోయిన్స్ కు ఈ బాధ లేదు. ఓ అరడజను భాషల్లో ఒకేసారి సినిమాలు చేసుకుంటూ రెండు చేతుల్లా డబ్బులు పోగేసుకోవచ్చు. అన్నీ ఇండస్ట్రీలను చుట్టేసి రావొచ్చు.

Srinidhi Shetty
Srinidhi Shetty

పైగా ఒక భాషలో ఒక సినిమా హిట్ అయితే.. చకచకా నాలుగు వైపులా నుంచి అవకాశాలు వస్తాయి. పూజా హెగ్డే, రష్మిక లకు ఇలాగే అవకాశాలు వచ్చాయి. వచ్చిన డిమాండ్ కి తగినట్టుగానే వీళ్లు పారితోషికాన్ని పెంచేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ‘కేజీఎఫ్’ బ్యూటీ శ్రీనిధి శెట్టి కూడా తన కెరీర్ ను ప్లాన్ చేసుకోవాలని ఆశ పడుతుంది. కానీ, అది సరిగ్గా సెట్ కావడం లేదు.

Also Read: Unique And Weird Ways Of Burial: సండే స్పెషల్: చనిపోయిన వ్యక్తిని రాబందులకు విసిరేస్తారు..: వింత ఆచారం ఎక్కడో తెలుసా..?

‘కేజీఎఫ్ 2’ సంచలన విజయాన్ని సాధించడంతో పారితోషికాన్ని మరింత పెంచింది శ్రీనిధి శెట్టి. కానీ, ఆమెకు సినిమాలు రావడం లేదు. శ్రీనిధి శెట్టిని హీరోయిన్ గా తీసుకోవడానికి నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు. దాంతో ఆమె పారితోషికం విషయంలో దిగి రావాల్సిన పరిస్థితి నెలకొంది. పాపం.. భారీ పాన్ ఇండియా హిట్ కొట్టాక కూడా పాపకు కలిసి రావడం లేదు.

Srinidhi Shetty
Srinidhi Shetty

ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. శ్రీనిధి శెట్టిలో ఏమి తక్కువ అంటూ నెటిజన్లు ఆమెకు తెగ సపోర్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు గానీ, సినిమాల్లో ఛాన్స్ లు ఇచ్చేవారే లేరు. ఆ మధ్య ఒక జర్నలిస్ట్ శ్రీ‌నిధి శెట్టితో ‘మీకు పేరు కావాలా ? లేక, డబ్బు కావాలా ? అంటూ ఒక ప్రశ్న అడిగారు. ‘నాకు డ‌బ్బే కావాలంటూ మొహమాటం లేకుండా చెప్పింది.

డబ్బు కోసం శ్రీనిధి శెట్టి ఇంతలా పరితపిస్తుంటే.. ఆమెను ఎవరూ సంప్రదించడం లేదు. అన్నట్లు శ్రీనిధి శెట్టి లైగర్‌ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేయబోతుందని గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తల్లో కూడా వాస్తవం లేదు. సలార్ సినిమాలో అమ్మడు ఒక స్పెషల్ క్యారెక్టర్ చేస్తోంది అంటూ ప్రచారం జరిగింది. ఆ ప్రచారంలోనూ నిజం లేదు అని తేలిపోయింది.

Also Read:Mahesh- Rajamouli Movie: మహేష్ – రాజమౌళి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

CM Vijay viral assembly video

Tamil Nadu CM Vijay : సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. దెబ్బకు మారిపోయిన రాజకీయ సమీకరణాలు..

Tamil Nadu CM Vijay : గత రెండు మూడు రోజులుగా ఢిల్లీ పార్లమెంట్ వద్ద జరుగుతున్న ఉద్రిక్త పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం...
Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి విషయంలో లైట్ తీసుకున్న స్టార్ డైరెక్టర్స్…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి దర్శకుడు ఇండస్ట్రీకి రావడానికి ముందే చిరంజీవి సినిమాలను చూసి వచ్చినవారే కాదా విశేషం.. ఇండస్ట్రీ లో సక్సెస్...
Vijay Deverakonda Vs Naveen Polishetty

Vijay Deverakonda Vs Naveen Polishetty: విజయ్ దేవరకొండ vs నవీన్ పోలిశెట్టి… పోటీ మామూలుగా లేదుగా…

Vijay Deverakonda Vs Naveen Polishetty: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మధ్య ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికి సినిమాల విషయంలో వాళ్ళ మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉంటుంది. పర్సనల్ విషయాల్లో...
Oktelugu Epaper