Actor Nassar: ప్రముఖ సీనియర్ నటుడు నాజర్ త్వరలో తాను నటనకు వీడ్కోలు పలకనున్నట్టు తన సినీ సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది. సౌత్ సినీ అగ్ర శ్రేణి నటుల్లో నాజర్ కూడా ఒకరు. తన కెరీర్ లో ఎన్నో గొప్ప సినిమాల్లో నాజర్ అనేక విభిన్న పాత్రలను పోషించి మెప్పించారు. ఆయన ఎన్నో సినిమాలకు ఉత్తమ నటుడిగా కూడా అనేక అవార్డులు అందుకున్నారు.

అలాంటి నాజర్ సినిమాల నుంచి త్వరలోనే రిటైర్మెంట్ తీసుకుంటానని తాజాగా ఇండస్ట్రీ జనంతో చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. నాజర్ కంటే వయసులో పెద్దవాళ్ళు కూడా ఇంకా యాక్టివ్ గా నటిస్తుంటే.. నాజర్ కు మాత్రం ఏమైంది ? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. నాజర్.. రోజుకు లక్ష నుంచి రెండు లక్షలు డిమాండ్ చేసి తీసుకుంటున్నారు. అలాంటి ఆయన సడెన్ గా సినిమాల నుంచి తప్పుకోవాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు ?
Also Read: Srinidhi Shetty: పాన్ ఇండియా హిట్ కొట్టినా.. పాపం, పాపకు కలిసి రావడం లేదు
నాజర్ సినిమాల నుంచి తప్పుకోవడానికి వేరే కారణం ఏమైనా ఉందా ? లేక, సినిమాల పై ఆసక్తి పోయిందా ? ఇలా సినీ జనంలో చర్చ మొదలు అయ్యింది. అయితే, కారణం మాత్రం ఒక్కటే. ఈ మధ్య ఆయన తన ఆరోగ్యం పై ఎక్కువ శ్రద్ధ పెట్టారు. కరోనా కాలంలో నాజర్ గుండె సంబంధిత వ్యాధితో కొన్నాళ్ళు బాధ పడ్డారు. అప్పటి నుంచి ఆయన సినిమాలు కూడా తగ్గిస్తూ వచ్చారు.

అందుకే.. ఈ మధ్య ఓ సినిమా సెట్స్ లో మెగాస్టార్ చిరంజీవిని కలిసిన నాజర్.. చిరుతో ఈ విధంగా కామెంట్స్ చేశారట. సినిమా పరిశ్రమలో తన నటనకు సంబంధించి ఇదే చివరి దశగా ఆయన స్పష్టం చేశారు. ఆ మధ్య ఓ ప్రముఖ మ్యాగజైన్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా కూడా నాజర్ ఈ విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా వెల్లడించారు.
నాజర్ మాటల్లోనే.. ’’నాకు తెలిసినంత వరకు నేను చివరి దశలోనే ఉన్నాను. సినిమాల పై ఆసక్తి ఉంది. కానీ.. వయసు కూడా సహకరించాలి కదా. ఒకవేళ భవిష్యత్తులో సినిమాల్లో నటించినా చాలా సెలెక్టివ్ గా మాత్రమే చేస్తాను’ అంటూ నాజర్ రెండేళ్ల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో కామెంట్స్ చేశారు.
Also Read:Nagababu Emotional Post: నాన్న.. అప్పుడు నాకు జ్ఞానం లేదు, ఇప్పుడు మీరు లేరు – నాగబాబు
[…] […]