Sreemukhi: స్టార్ యాంకర్ శ్రీముఖి షార్ట్ ఫ్రాక్ ధరించి కిరాక్ ఫోజులిచ్చారు. సాలిడ్ అందాలు దగ్గరగా చూపిస్తూ మెస్మరైజ్ చేశారు. బొద్దుగుమ్మ ముద్దొచ్చే అందాలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. శ్రీముఖి తన లేటెస్ట్ ఫోటో షూట్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ గా మారింది. ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు.

రష్మీ, అనసూయ వంటి యాంకర్స్ స్ఫూర్తితో బుల్లితెర యాంకర్ గా మారింది శ్రీముఖి. వాళ్లకు ఏమాత్రం తగ్గకుండా అందాల విందు చేస్తుంది. చాలా తక్కువ కాలంలో గుర్తింపు తెచ్చుకున్న యాంకర్స్ లో శ్రీముఖి ఒకరు. పటాస్ షోతో ఆమె కెరీర్ మొదలు కాగా టాప్ యాంకర్స్ లో ఒకరిగా కొనసాగుతున్నారు.

ప్రస్తుతం పలు బుల్లితెర షోలకు ఆమె యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. శ్రీముఖి నాన్ స్టాప్ పంచ్లు విసురుతూ ఎనర్జీతో షోలను రక్తి కట్టిస్తారు. బుల్లితెర రాములమ్మ గా పేరు తెచ్చుకున్న శ్రీముఖికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. యాంకర్ గా వచ్చిన ఫేమ్ తో హీరోయిన్ గా కూడా మారింది.

శ్రీముఖి హీరోయిన్ గా క్రేజీ అంకుల్స్ టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కింది. రాజా రవీంద్ర, సింగర్ మను, భరణి ప్రధాన పాత్రలు చేసిన ఈ మూవీ గత ఏడాది విడుదలైంది. అయితే అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. అలాగే నితిన్ హీరోగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైన మ్యాస్ట్రో చిత్రంలో శ్రీముఖి ఓ రోల్ చేశారు.

హీరోయిన్ గా అవకాశాలు రాకున్నా నటిగా శ్రీముఖి వెండితెరపై సత్తా చాటుతున్నారు. యాంకర్ గా, నటిగా బిజీగా ఉన్న శ్రీముఖి పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది శ్రీముఖి లూవీ పేరుతో ఓ ఫ్యాషన్ బ్రాండ్ స్టోర్స్ చైన్ ప్రారంభించారు.

అలాగే యూట్యూబ్ లో తన ఛానల్ లో పలు ఇంట్రెస్టింగ్ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. యూట్యూబ్ ద్వారా మరికొంత ఆదాయం ఆర్జిస్తున్నారు. ఇక వ్యాపార ఉత్పత్తుల ప్రమోషన్స్, ఈవెంట్స్ ద్వారా ఆదాయం రాబడుతున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు, కదా. శ్రీముఖి అదే చేస్తుంది. ఫేమ్ ఉన్నప్పుడే సరిపడా సంపాదించుకుంటుంది.


Recommended Videos