spot_img
Homeఎంటర్టైన్మెంట్Sri Reddy On Pawan Kalyan: 'పవన్ కళ్యాణ్' పై శ్రీరెడ్డి సంచలన...

Sri Reddy On Pawan Kalyan: ‘పవన్ కళ్యాణ్’ పై శ్రీరెడ్డి సంచలన కామెంట్స్ !

Sri Reddy On Pawan Kalyan: ‘భీమ్లానాయక్’ మూవీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు కొల్లగొడుతోంది. సినిమా బ్లాక్‌ బాస్టర్ టాక్‌ తో దూసుకుపోతుంది. శనివారం కూడా హౌస్‌ ఫుల్ కలెక్షన్లు నడిచాయి. తొలిరోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ 26 కోట్ల కలెక్షన్లు వసూలు చేసిందని తెలుస్తోంది. వరల్డ్ వైడ్ ఫస్ట్ డే 34 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. నిజానికి ఏపీలో థియేటర్ల సమస్య ఉంది.

Sri Reddy On Pawan Kalyan
Sri Reddy On Pawan Kalyan

ముఖ్యంగా బెనిఫిట్ షోలు లేకపోవడం, టికెట్ రేట్లు తక్కువగా ఉండడంతో కలెక్షన్లలో కొంచెం డ్రాప్ ఉంది. దాంతో పవన్ అభిమానులు ఏపీలో చాలా చోట్ల అనేక రకాలుగా తమ నిరాశను వ్యక్తపరిచారు. అయితే.. కొన్ని చోట్ల మాత్రం వినూత్నంగా జగన్ కి షాక్ ఇచ్చారు. విజయవాడలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ భారీ ఫ్లెక్సీని పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఏర్పాటు చేశారు.

సినిమా విడుదల సందర్భంగా తెలంగాణలో టిక్కెట్ ధరల పెంపునకు, ఐదో షోకు అనుమతులు ఇవ్వడంతో పవన్ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. దీంతో హ్యాట్సాఫ్ సీఎం అంటూ విజయవాడ కృష్ణలంకలోని ఫైర్ స్టేషన్ సమీపంలో కేసీఆర్ భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలో మంత్రులు కేటీఆర్, తలసాని ఫోటోలు కూడా ఉన్నాయి.

Also Read: పేరు మార్చుకున్న స్టార్ హీరో.. ఎగబడుతున్న కొత్త దర్శకులు !

జగన్ ప్రభుత్వాన్ని అవమానించడానికే ఇలా చేశారు అంటూ వైసీపీ కార్యకర్తలు కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ మూవీ భీమ్లా నాయక్ పై నటి శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. భీమ్లా నాయ‌క్ సినిమా చాలా చెత్తగా ఉందని.. రాజకీయ లబ్ది కోసమే పవన్‌ కళ్యాణ్ ఈ చెత్త మూవీని తీసాడని ఆమె ఆగ్రహించారు.

ఇంకా పవన్ ను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. ‘నీ వ్యక్తిగత లబ్ది కోసం నువ్వు తెలంగాణ ప్రభుత్వాన్ని కలువచ్చు.. చిరంజీవి మాత్రం సీఎం జగన్‌ ను కలువకూడదా ? అని ఆమె పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా… సీఎం కాలేవన్నారు. మొత్తానికి శ్రీ రెడ్డి తాజా కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి.

Also Read: ‘కళావతి’తో యూట్యూబ్‌ ను షేక్ చేస్తోన్న మహేష్ !

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper