Homeఎంటర్టైన్మెంట్Sreeleela: పీరియడ్స్ లో ఉన్నప్పుడే అలాంటి పనులు చేసేదానిని అంటూ హీరోయిన్ శ్రీలీల కామెంట్స్..

Sreeleela: పీరియడ్స్ లో ఉన్నప్పుడే అలాంటి పనులు చేసేదానిని అంటూ హీరోయిన్ శ్రీలీల కామెంట్స్..

Sreeleela: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన నటి శ్రీలీల(Actress Sree Leela) . అతి చిన్న వయస్సులోనే ఒక పక్క డాక్టర్ చదువుతూ , మరో పక్క సినిమాలు చేస్తూ , క్షణం కాలం తీరిక లేకుండా గడిపేది. అవకాశాలు అయితే ఆమెకు వరుసగా వస్తున్నాయి కానీ , సక్సెస్ లు మాత్రం రావడం లేదు. తెలుగు లో ఇప్పటి వరకు ఈమెకు కేవలం మూడు హిట్ సినిమాలు […]

Sreeleela: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన నటి శ్రీలీల(Actress Sree Leela) . అతి చిన్న వయస్సులోనే ఒక పక్క డాక్టర్ చదువుతూ , మరో పక్క సినిమాలు చేస్తూ , క్షణం కాలం తీరిక లేకుండా గడిపేది. అవకాశాలు అయితే ఆమెకు వరుసగా వస్తున్నాయి కానీ , సక్సెస్ లు మాత్రం రావడం లేదు. తెలుగు లో ఇప్పటి వరకు ఈమెకు కేవలం మూడు హిట్ సినిమాలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన సినిమాలన్నీ కమర్షియల్ గా దారుణమైన పరాజయాలుగా నిలిచాయి. రీసెంట్ గా విడుదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం పై ఆమె చాలా అంచనాలే పెట్టుకుంది కానీ, బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా కూడా దారుణమైన పరాజయం పాలవ్వడం తో , మన టాలీవుడ్ లో శ్రీలీల కెరీర్ భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి.

ప్రస్తుతం ఆమెకు తెలుగు లో కంటే తమిళం లోనే ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే ధనుష్ తో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న , త్వరలోనే ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వం లో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతుంది. అంతే కాకుండా హిందీ లో ఆమె పలు సినిమాలు పూర్తి చేసింది. అవి కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కనీసం ఇవైనా హిట్ అవుతాయో లేదో చూడాలి. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే శ్రీలీల ఈవెంట్ లో మాట్లాడిన కొన్ని మాటలు , ఇప్పుడు యువత ని ఆలోచింపచేసేలా ఉన్నాయి. ఆడవాళ్లు ఎంత బలంగా నిలబడాలి శ్రీలీల చెప్పిన ఈ సందర్భాన్ని ఆదర్శంగా తీసుకోవచ్చు. ఆమె మాట్లాడుతూ ‘అందరూ నా డ్యాన్స్ బాగుంటుంది అని అంటుంటారు. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ చేశాను. అందులో సూపర్ హిట్ గా నిల్చిన సాంగ్స్ అన్నీ నేను పీరియడ్స్ సమయం లోనే చేశాను’ అంటూ చెప్పుకొచ్చింది.

ఇంకా ఆమె మాట్లాడుతూ ‘పురుషులతో అన్ని విధాలుగా పోటీ పడాలని అనుకునే మనం, పీరియడ్స్ వంటి సమస్యలను సాకుగా చూపించి మన పనులను వాయిదా వేస్తూ, వెనక్కి తగ్గడం కరెక్ట్ కాదు. ఎలాంటి సందర్భం మన ఎదురుగ వచ్చినా మనల్ని మనం ముందుకు నెట్టుకుంటూ వెళ్ళాలి’ అంటూ చెప్పుకొచ్చింది. శ్రీలీల మాట్లాడిన ఈ మాటలకు కొంతమంది నెటిజెన్స్ మెచ్చకుంటుండగా , మరికొంతమంది మాత్రం విమర్శిస్తున్నారు. ఒక డాక్టర్ అయ్యుండి ఇలాంటి సలహాలు ఎలా ఇస్తావు ?, అందరి శరీర తీరు ఒకేలా ఉండదు కదా, నువ్వు చెప్పిన మాటలను ఆదర్శంగా తీసుకొని రేపు కొంతమంది పీరియడ్స్ ని లెక్క చేయకుండా, తమ శక్తికి మించిన పనులు చేస్తే , పరిస్థితి ఏంటి అంటూ శ్రీలీల ని ప్రశ్నిస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper