Single Screen Theatres closure impact: సినిమా ఇండస్ట్రీలో పెద్ద సినిమాలకి ఉన్న హవా చిన్న సినిమాలకు ఉండడం లేదు. ఎందుకంటే పెద్ద సినిమాల గ్రాండియార్ వేరేలా ఉంటుంది. చిన్న సినిమాల పరిధి మరోలా ఉంటుంది. చిన్న సినిమాలు లిమిటెడ్ బడ్జెట్ తో తెరకెక్కుతుంటాయి. అయినప్పటికి చిన్న సినిమాల దర్శకులు సినిమాని నెక్స్ట్ లెవల్లో నిలుపడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాల పరిస్థితి చాలా దారుణంగా తయారైపోయింది. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అయితే చిన్న ప్రొడ్యూసర్లు బతికే అవకాశం లేదు అంటూ చాలామంది సినిమా సెలబ్రిటీలు సైతం కామెంట్స్ చేస్తూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం….చిన్న మూవీస్ కి ఉన్న ఒకే ఒక బలం సింగిల్ స్క్రీన్స్…కానీ ఇప్పుడు వాటిని మూసివేసే పరిస్థితైతే వచ్చింది. మే 1 వ తేదీ నుంచి సింగిల్ స్క్రీన్ ను మూసేస్తాం అంటూ ఎగ్జిబ్యూటర్ల సంఘం ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి ఒక లేఖనైతే అందించింది. దానికి గల కారణం ఏంటంటే సింగిల్ స్క్రీన్స్ కి రెంట్ పర్పస్ లో కాకుండా పర్సెంటేజ్ రూపం లో అమౌంట్ చెల్లించాలని ఎగ్జిబ్యూటర్స్ డిమాండ్ చేస్తున్నారు.
రెంట్ పర్పస్ లో ఇవ్వడం వల్ల సింగల్ స్క్రీన్స్ వాళ్లకి కనీసం థియేటర్లు మెయింటెన్ చేసేంత డబ్బులు కూడా రావడం లేదు. అదే మల్టీప్లెక్స్ లకు అయితే పర్సంటేజ్ విషయంలో ప్రొడ్యూసర్లు చాలా ఫేవర్ గా ఉంటున్నారని సింగిల్ స్క్రీన్స్ ను అసలు ఎందుకు పట్టించుకోవడం లేదని వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒకవేళ సింగిల్ స్క్రీన్స్ ని కనుక మూసివేసినట్లయితే మాత్రం చిన్న సినిమాలు బతికే అవకాశం లేదు. కారణం ఏంటంటే మల్టీ ప్లేక్ లో ఏ చిన్న సినిమాను చూసుకున్న టికెట్ రేట్ 200 పైనే ఉంటుంది. అదే సింగిల్ స్క్రీన్ లో చూసుకుంటే 100 రూపాయల టికెట్ కొనుక్కొని కూడా వెళ్లే ఫెసిలిటీ ఉంది. అలాగే ఇంటర్వెల్ లో పాప్ కార్న్ సైతం తక్కువ రేటుకే లభిస్తాయి.
అది మల్టీప్లెక్స్ లో అయితే పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ రేట్ వేళల్లో ఉంటున్నాయి. వాటన్నింటిని భరిస్తూ సగటు ప్రేక్షకుడు మల్టీప్లెక్స్ కి వెళ్లి సినిమాను చూసే అవకాశమైతే లేకుండా పోతుంది. తద్వారా చిన్న సినిమాలు బతికే అవకాశం లేదు అంటూ చాలామంది సినిమా మేధావులు సైతం కామెంట్లు చేస్తున్నారు…
