Mahesh Babu movie rejection reason: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి చాలా మంచి క్రేజ్ ఉంది..ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరిని మెప్పించాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తనని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. తన దగ్గర సత్తా చాటుతూ ముందుకు దూసుకెళుతున్న ఈ స్టార్ హీరో ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో చేస్తున్న వారణాసి సినిమాతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులను తన వైపు తిప్పుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన ఏ సినిమాలో కూడా డ్యూయల్ రోల్ లో నటించలేదు. కానీ ఈ సినిమాలో మాత్రం 5 క్యారెక్టర్లలో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మహేష్ బాబు లాంటి నటుడు దొరికితే ఎవరైనా సరే ఒక భారీ యాక్షన్ ఎమోషనల్ సినిమాని చేసి సక్సెస్ సాధించాలని చూస్తారు. కానీ రాజమౌళి మాత్రం సైన్స్ ఫిక్షన్ సినిమాను ఎంచుకొని మరి ఈ మూవీని నెక్స్ట్ లెవెల్లో నిలిపే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా ఒక స్టార్ డైరెక్టర్ మహేష్ బాబుంతనతో సినిమా చేయకపోవడానికి కారణం ఇదే అంటూ కొన్ని సంచలన కామెంట్స్ చేశాడు.
ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు ఆయన చేసిన కామెంట్స్ ఏంటి అంటే కంత్రి,బిల్లా,శక్తి,షాడో, భోళా శంకర్ లాంటి సినిమాలు చేసి సరైన సక్సెస్ ని సాధించలేకపోయిన మెహేర్ రమేష్ కావడం విశేషం… మహేష్ బాబు మేజర్ రమేష్ మధ్య చాలా మంచి స్నేహమైతే ఉంది.కెరియర్ మొదట్లో మెహర్ రమేష్ మహేష్ బాబు తో సినిమా చేయాలనుకున్నాడు..కానీ అనుకోని కారణాల వల్ల ఆయన ఎన్టీఆర్ తో సినిమా చేయాల్సి వచ్చింది.
ఇక మొదటి సినిమా పూర్తి అయిన తర్వాత ప్రభాస్ తో బిల్లా చేశాడు. ఈ సినిమా కూడా కంప్లీట్ అయిన తర్వాత మహేష్ బాబుతో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేశారు. కానీ మహేష్ బాబు మాత్రం మెహర్ రమేష్ కి సినిమా ఇయ్యలేదు. కారణం ఏంటంటే ఆయన చెప్పిన కథ మహేష్ బాబుకి నచ్చలేదట. దానివల్లే తనకు సినిమా చేసే అవకాశం ఇవ్వలేదని గతంలో మెహర్ రమేష్ అయితే తెలియజేశాడు.
ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు అభిమానులు ఈ విషయంలో మహేష్ బాబు ను మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే డిజాస్టర్ సినిమాలను చేసే మెహర్ రమేష్ లాంటి డైరెక్టర్ కి సినిమా ఇచ్చి ఆ సినిమా ప్లాప్ గా మారితే మహేష్ మార్కెట్ మరింత డౌన్ అయిపోయేదని మహేష్ ఒక ఫ్లాప్ నుంచి తప్పించుకున్నాడు అంటూ వాళ్ళు కామెంట్స్ చేస్తుండటం విశేషం…
