Shriya Saran: అందాల ముదురు భామ ‘శ్రియా సరన్’ బీచ్ లో తాజాగా రచ్చ రచ్చ చేసింది. సమ్మర్ వెకేషన్ ను ఫ్యామిలీతో కలిసి ఇలా ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ఈ సందర్భంగా బికినీలో హాట్ పోజులిచ్చి నెట్ లో హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం శ్రియా పోస్ట్ చేసిన ఈ బికినీ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. మరి ఆ ఫోటోలు ఏమిటో మీరు కూడా ఒక లుక్కేయండి.

గతంలో కూడా శ్రియా తన భర్త ఆండ్రీ కొశ్చివ్ తో తెగ విహార యాత్రలు చేసి.. పూర్తి సుఖసంతోషాలతో తెగ మురిసిపోయింది. ఎప్పటికప్పుడు తన టూర్ వీడియోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. తన ఫాలోవర్స్ కి తన రొమాంటిక్ క్షణాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ వస్తోంది.
Also Read: Director Parashuram Biography: డైరెక్టర్ పరశురామ్ గురించి షాకింగ్ విషయాలు

ఇక శ్రియ అభిమానులు ఆమె పోస్ట్ చేస్తోన్న ఫోటోలు చూసి తెగ ఇదైపోతున్నారు. ఫోటోల్లో శ్రియ కవ్విస్తూ రెచ్చ గొడుతుంది. పైగా బికినీలో హీట్ పెంచుతుంది. అందుకే, ఆమె ఏమి పోస్ట్ చేసినా అవి క్షణాల్లో వైరల్ అయిపోతున్నాయి. ఐతే, ఈ బికినీ రచ్చ చూసి ఇవేం ఫోజులరా దేవుడా ? అని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు.

ఏది ఏమైనా, పాత్ర ఏదైనా తనదైన శైలిలో మెప్పిస్తూ ఆడియెన్స్ ను తన అభిమానులుగా మార్చుకుంది ఈ సీనియర్ హీరోయిన్. అయితే, శ్రియా సరన్’కి ఇంకా ఒక కోరిక మిగిలిపోయిందని తెగ ఇదైపోతూ ఆమె తన సన్నిహితుల దగ్గర చెప్పుకుని బాధ పడుతుందట.

ఇంతకీ ఆ కోరిక ఏమిటనేగా.. బాలీవుడ్ లో హాట్ హాట్ ఎక్స్ పోజింగ్ తో మసాలాకే సెగ పుట్టేలా ఒక బోల్డ్ సాంగ్ చేయాలని శ్రియా సరన్ ఎప్పటి నుంచో ఆశ పడుతుంది. అయితే, ఆమెకు మాత్రం ఇప్పటివరకు సరైన అవకాశం రాలేదట. అందుకే, అలాంటి అవకాశం కోసం శ్రియా ఎదురు చూస్తోంది.

అయితే, శ్రియాకి ఛాన్స్ ఇచ్చే హీరో మాత్రం దొరకడం లేదు. గతంలో అజయ్ దేవగణ్ తో, అలాగే అక్షయ్ కుమార్ తో కూడా శ్రియా చాలా క్లోజ్ గా మూవ్ అయింది. అజయ్ దేవగన్ ఆమెకు ఛాన్స్ కూడా ఇచ్చాడు. అయినా ఆ సినిమా ఆమెకు ఏ రకంగానూ ప్లస్ కాలేదు. అందుకే, బాలీవుడ్ లో స్టార్ డమ్ సాధించాలి అంటే.. మంచి మసాలా సాంగ్ ఒకటి తనకు పడాలి అని శ్రియా కోరుకుంటుంది.

బాలీవుడ్ లో ఇప్పటికే శ్రియా కొన్ని సినిమాల్లో కూడా నటించింది. ఇంకా కొన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాడనికి ప్రయత్నాలు చేస్తోంది. మరి శ్రియా బలంగా కోరుకుంటున్న ఆ ఒక్క అవకాశం ఆమెకు దక్కుతుందా ? చూడాలి.
