Homeఎంటర్టైన్మెంట్Munjya OTT: బ్లాక్ బస్టర్ చిత్రానికి ఓటీటీలో షాకింగ్ రెస్పాన్స్... మేకర్స్ కి ఝలక్ ఇచ్చిన...

Munjya OTT: బ్లాక్ బస్టర్ చిత్రానికి ఓటీటీలో షాకింగ్ రెస్పాన్స్… మేకర్స్ కి ఝలక్ ఇచ్చిన ఆడియన్స్!

Munjya OTT: కొన్ని చిత్రాలు థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ విజయాలు నమోదు చేస్తాయి. తీరా ఓటీటీలో చూస్తే కనీస ఆదరణ దక్కించుకోలేవు. గతంలో ఈ పరిస్థితి చాలా చిత్రాలకు ఎదురైంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన జాతిరత్నాలు బ్లాక్ బస్టర్ కొట్టింది. కొత్త దర్శకుడు అనుదీప్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలు చేశారు. కేవలం రూ. 7 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన జాతిరత్నాలు రూ. 70 కోట్ల వసూళ్లు రాబట్టి భారీ లాభాలు పంచింది.

కానీ జాతిరత్నాలు మూవీ ఓటీటీలో డిజాస్టర్ అయ్యింది. జాతిరత్నాలు ఓ చెత్త సినిమా అని ఆడియన్స్ తేల్చారు. కాంతార పరిస్థితి కూడా సేమ్. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి నటించిన కాంతార 2023లో విడుదలైన చిత్రాల్లో ఒక సంచలనం. విడుదలైన అన్ని భాషల్లో కాంతార గొప్ప రెస్పాన్స్ పొందింది. రూ. 16 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం రూ. 400 కోట్ల వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాల మైండ్ బ్లాక్ చేసింది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చిన కాంతార మిశ్రమ స్పందన దక్కించుకుంది.

ఓటీటీ ఆడియన్స్ కాంతార చిత్రాన్ని పెద్దగా ఇష్టపడలేదు. అంతగా ఏం బాగుందని అన్ని కోట్లు వసూలు చేసిందని ఎద్దేవా చేశారు. లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ముంజ్యా కి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. హిందీ హారర్ కామెడీ చిత్రం ముంజ్యా జూన్ 7న థియేటర్స్ లో విడుదల చేశారు. ఆదిత్య సర్పోట్దర్ దర్శకత్వం వహించిన ముంజ్యా చిత్రంలో శర్వాణి, అభయ్ వర్మ, సత్యరాజ్ ప్రధాన పాత్రలు చేశారు.

రూ. 30 కోట్ల బడ్జెట్ తో ముంజ్యా నిర్మించారు. రూ. 140 కోట్ల వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మ్యాడ్ డాక్ సూపర్ నాచురల్ యూనివర్స్ లో భాగంగా ముంజ్యా తెరకెక్కింది. ఈ యూనివర్స్ లో స్త్రీ, భేడియా, స్త్రీ 2 చిత్రాలు తెరకెక్కాయి. స్త్రీ 2 సైతం సంచలనాలు నమోదు చేస్తుంది. ఈ మూవీ వసూళ్లు రూ. 500 కోట్లకు చేరువయ్యాయి.

ముంజ్యా చిత్రం కామెడీ, హారర్ అంశాలతో మెప్పించింది. విజువల్ ఎఫెక్ట్స్ ఏమంత ఆశాజనకంగా లేకున్నా… ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ముంజ్యా మూవీ ఆగస్టు 23 నుండి హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. అయితే ప్రేక్షకుల నుండి ఆశించిన రెస్పాన్స్ లేదు. ఓటీటీలో ముంజ్యాకి మిశ్రమ స్పందన వస్తుంది. కొన్ని చిత్రాలను థియేటర్స్ లోనే చూడాలి. ముఖ్యంగా హారర్ చిత్రాల థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరు. ఇంట్లో బుల్లితెరపై ఈ చిత్రాలు గొప్ప అనుభూతిని పంచకపోవచ్చు.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper