Bigg Boss 7 Telugu: హలో బిగ్ బాస్ లవర్స్.. ఈ రోజు శనివారం ఫుల్ ఎగ్జైట్ మెంట్ తో ఉండి ఉంటారే.. సోమవారం వస్తే ఎవరు ఎలిమినేషన్ లో ఉంటారు? వీకెండ్ వస్తే ఎవరు ఇంట్లో నుంచి వెళ్లిపోతారు అనే టెన్షన్ ఎక్కువగా ఉంటుంది కదా.. కానీ ఈ సారి మనం చర్చించుకోబోయే పర్సన్ కచ్చితంగా బిగ్ బాస్ నుంచి వెళ్లిపోతారట. ఏంటి జ్యోతిష్యాలు చెబుతున్నారా అని అనుకోకండి.. కానీ ఓటింగ్ ను బట్టి చూస్తే.. ఇదే నిజం అనిపిస్తుంది.. సరే ఓ సారి ఎవరు అనుకుంటున్నారేమో చూసేయండి. మీకు కూడా అవును అనిపిస్తే కామెంట్ చేయండి…
ప్రతి వారం టేస్టీ తేజాను బిగ్ బాస్ సేవ్ చేస్తున్నారు ఏమో అనిపిస్తుందట నెటిజన్లకు. అయితే ప్రతి సారి ఛాన్స్ ఇస్తున్న బిగ్ బాస్ ఈ సారి కూడా తేజాను సేఫ్ చేయడం ఖాయం అంటున్నారు కొందరు. బిగ్ బాస్ హౌస్ లో జరుగుతున్న పరిణామాలు.. టేస్టీ తేజానికి లభిస్తున్న స్క్రీన్ స్పేస్.. అతనికి పెరుగుతున్న ఓటింగ్ శాతం.. పుంజుకుంటున్న విధానం చూసి నామినేషన్స్‌లో ఉన్న ఏడుగురిలో టేస్టీ తేజా సేఫ్ అవ్వబోతున్నడనే విషయం ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది.
అయితే ఈ వారం ఎలిమినేషన్ లో ఎవరెవరు ఉన్నారంటే…టేస్టీ తేజా, శుభశ్రీ, ప్రియాంక, అమర్ దీప్, యావర్, గౌతమ్ కృష్ణ, శివాజీలు ఉండగా.. గత వారమే చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుగా బయటపడిన తేజా.. ఈవారం ఎలిమినేట్ కావడం కన్ఫామ్ అనుకున్నారు అందరూ. కానీ.. బిగ్ బాస్ లో ఈ సారి ఉల్టా ఫుల్టా అనిపెట్టారు కాబట్టి ఉల్టాఫుల్టా గానే ఎలిమినేషన్ కూడా జరుగుతుంది. దీంతో ఈవారం ఎలిమినేట్ కాబోతున్నది ఎవరో కాదు.. శుభశ్రీ రాయగురు. ఎస్.. ఈవారం శుభశ్రీ ఎలిమినేట్ కాబోతుందనే లీక్ బయటకు వచ్చేసింది. ఎందుకు అనుకుంటున్నారా? అది కూడా తెలుసుకుందాం..
శుభశ్రీ సేఫ్ అనుకున్నారు అందరూ.. కానీ ఈమె గ్రాఫ్ క్రమంగా తగ్గుతూ వచ్చింది. ముఖ్యంగా ఆ లెటర్ టాస్క్‌లో శుభశ్రీ బిహేవ్ చేసిన విధానం ఆడియన్స్‌కి నచ్చలేదు. చివరి రెండు రోజుల్లో శుభశ్రీ గ్రాఫ్ తగ్గుతూ వస్తుంటే.. తేజా గ్రాఫ్ పెరిగింది. ఇక యావర్ ఫ్యాన్స్ ఓట్లు కూడా తేజా వైపుకి మల్లుతాయి. దీంతో తేజా డేంజర్ జోన్ నుంచి బయటపడ్డారు.
అయినా మరొక విషయం గమనిస్తే.. ప్రతి సారి ఎలిమినేట్ అవుతూ ఇంటి నుంచి బయటకు వెళ్లే వారిలో లేడీస్ మాత్రమే ముందుంటున్నారు. తొలివారంలో కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, మూడో వారంలో దామిని, నాలుగో వారంలో రతిక రోజ్.. ఇప్పుడు శుభశ్రీ కూడా ఎలిమినేట్ అయితే.. ఐదో వారంలో కూడా ఫీమేల్ కంటెస్టెంట్‌ని ఎలిమినేట్ చేసినట్టు. వరుసగా ఐదుగురు ఆడాళ్లు ఎలిమినేట్ కావడం బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో ఇదే తొలిసారి. గతవారం రతిక ఎలిమినేషన్ షాకింగ్ అనుకుంటే.. ఈవారం శుభశ్రీ ఎలిమినేషన్ కూడా షాకింగే. అయినా మనం అనుకున్న ఈ ఎలిమినేషన్ నిజమో కాదో తెలియాలి అంటే ఇంక కాస్త సమయ పడుతుంది. అవును మీ మనుసులో కూడా ఇదే ఉంటే ఇంకెందుకు ఆలస్యం కామెంట్లో తెలిపేయండి. లేదా మరే ఇతర కంటెస్టెంట్ ఉన్నా సరే చెప్పేయండి. ఎలాగూ రిజల్ట్ వస్తాయి కాబట్టి తెలుసుకోవచ్చు.. ఏమంటారు ఫ్రెండ్స్…