Sarah Jane Dias: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రేక్షకులకు ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా తన బాధ్యతలను నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరోపక్క ఆయన అభిమానులు ఆయన అప్ కమింగ్ సినిమాల కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమా షూటింగ్స్ త్వరలో కంప్లీట్ చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా రానున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమాలకు అభిమానుల లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రిజల్ట్ తో సంబంధం లేకుండా ఆయన సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. ఒక థియేటర్లలో పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు థియేటర్లలో జాతరే. పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా సినిమా చేయకపోయినప్పటికీ తనకంటూ ఒక బీభత్సమైన క్రేజ్ ను సంపాదించుకున్నారు. ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా తన బాధ్యతలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే పవన్ కళ్యాణ్ త్వరలో తన నెక్స్ట్ సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటి తన కెరియర్ లో పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలలో పంజా సినిమా కూడా ఒకటి. 2011లో ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ సినిమాకు మంచి రివ్యూస్ వచ్చాయి.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటన, లుక్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు అందించిన సంగీతం ఈ సినిమాకు హైలైట్ అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో నటించిన హీరోయిన్స్ కూడా ప్రేక్షకులకు బాగా గుర్తుండే ఉంటారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా నటించిన హీరోయిన్ పేరు సారా జెన్ డయాస్. ఈమె పంజా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పరిచయమైంది. సారా జెన్ అంటే తెలుగు ప్రేక్షకులకు తెలియక పోవచ్చు కానీ పంజా సినిమాలో హీరోయిన్ అంటే మాత్రం తెలుగు ప్రేక్షకులు ఇట్టే గుర్తుపట్టేస్తారు. అప్పట్లో ఈమె కాస్త బొద్దుగా, అందంగా కనిపించింది. పంజా మూవీ తర్వాత ఈమె తెలుగులో మరొక సినిమాలో కనిపించలేదు.

చాలా కాలం నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న సారా జెన్ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం సోషల్ మీడియా మాధ్యమాలలో క్రేజీ క్రేజీ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈమె లుక్ చూసి నేటిజెన్లు ఆశ్చర్యపోతున్నారు. అప్పట్లో ఎంతో బొద్దుగా, ముద్దుగా ఉన్న ఈ అమ్మడు ప్రస్తుతం పూర్తిగా బక్క చిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ప్రస్తుతం సారా జైన్ కు సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.