Trump : డొనాల్డ్ ట్రంప్ మొదటి రోజు సంచలనాలు సృష్టించాడు. దాదాపు 46 ఆర్డర్లు రిలీజ్ చేశారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్లలో కీలకమైనవి ఎన్నో ఉన్నాయి. ప్రపంచాన్ని ప్రభావితం చేసే ఆర్డర్లు కూడా ఇందులో ఉన్నాయి.
అన్నింటికంటే ముఖ్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా ఉపసంహరణ.. కరోనా సమయంలో చైనాకు లొంగి డబ్ల్యూ.హెచ్.ఓ నిర్ణయాలు తీసకున్నారని ఆరోపించారు. అందుకే వైదొలుగుతున్నట్టు
ట్రంప్ తెలిపారు.
ప్రపంచంలోని అన్ని దేశాల్లో ట్యాక్స్ హెవెన్స్ తక్కువ పన్నుతో అక్కడ రిజిస్ట్రర్ ఆఫీసులు పెట్టుకొని మోసం చేస్తున్నాయని.. మినమం ట్యాక్స్ ఉండాలన్న నిబంధనల నుంచి అమెరికా ఉపసంహరించుకుంది.
మూడో ప్యారిస్ క్లైమెట్ నుంచి అమెరికా ఉపసంహరణ నిర్ణయాన్ని ట్రంప్ తీసుకున్నారు. యూఎస్ ఎయిడ్ నుంచి పేద దేశాలకు నిధులు విడుదల ను నిలిపివేశారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో జలసంధిని.. ఇక నుంచి గల్ఫ్ ఆఫ్ అమెరికా అని పేరు మార్చాడు.
టిక్ టాక్ కంపెనీకి 75 రోజుల గడువు ఇస్తూ అమెరికన్లకు 50 శాతం వాటా అమ్మాలని ఆదేశాలు ఇచ్చాడు. దక్షణ సరిహద్దు, ఇంధన రంగంలో ఎమర్జెన్సీ విధించారు.
మొదటి రోజు ట్రంప్ ఉత్తర్వుల వివరాలపై విశ్లేషణను ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది మెయిల్ చేయండి..