Homeఎంటర్టైన్మెంట్'మెగాస్టార్'తో సంచలన దర్శకుడు.. సెట్ అయితే రికార్డ్స్ !

‘మెగాస్టార్’తో సంచలన దర్శకుడు.. సెట్ అయితే రికార్డ్స్ !

సినీ ప్రపంచంలో ధ్రువతారలు కొంతమందే ఉంటారు. వారితో కలిసి పని చేయాలని యావత్తు సినీ లోకంలోని చిన్నాచితకా వ్యక్తుల దగ్గర నుండి దిగ్గజాల వరకూ కలలు కంటూ ఉంటారు. కాగా తెలుగు సినీ ప్రపంచంలో ధ్రువతార అంటే.. మెగాస్టారే. ఎప్పుడైతే చిరంజీవి రీఎంట్రీ ఇస్తున్నా అని ఎనౌన్స్ చేశాడో.. అప్పటి నుండి ప్రతి దర్శకుడు చిరు కోసం కథలు వండటం మొదలుపెట్టారు. దీనికితోడు మెగాస్టార్ కూడా వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ వెళ్తున్నాడు. అందుకే చాలామంది డైరెక్టర్లు మెగాస్టార్ […]

Sandeep Reddy Vanga Chiranjeevi
సినీ ప్రపంచంలో ధ్రువతారలు కొంతమందే ఉంటారు. వారితో కలిసి పని చేయాలని యావత్తు సినీ లోకంలోని చిన్నాచితకా వ్యక్తుల దగ్గర నుండి దిగ్గజాల వరకూ కలలు కంటూ ఉంటారు. కాగా తెలుగు సినీ ప్రపంచంలో ధ్రువతార అంటే.. మెగాస్టారే. ఎప్పుడైతే చిరంజీవి రీఎంట్రీ ఇస్తున్నా అని ఎనౌన్స్ చేశాడో.. అప్పటి నుండి ప్రతి దర్శకుడు చిరు కోసం కథలు వండటం మొదలుపెట్టారు. దీనికితోడు మెగాస్టార్ కూడా వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ వెళ్తున్నాడు. అందుకే చాలామంది డైరెక్టర్లు మెగాస్టార్ కి కొత్త కథలు చెప్పడానికి ప్రయత్నాలు మొదలెట్టారు.

మరి ఏ దర్శకుడికైనా మెగాస్టార్ తో సినిమా చేయాలనీ ఉంటుంది కదా. ఎంత పెద్ద స్టార్ తో ఎన్ని సినిమాలు చేసినా.. ఒక్క మెగాస్టార్ తో సినిమా చేయడం వేరు. ఇప్పుడున్న దర్శకులు అందరూ చిరు సినిమాలు చూసి సినిమాల పై ప్రేమను పెంచుకున్నారు. అలాంటి వాళ్ళల్లో అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగ కూడా ఒకడు అట. అర్జున్ రెడ్డి సినిమాతో సందీప్ టాలీవుడ్ లో పెద్ద దుమారమే రేపాడు అనుకోవాలి. అప్పట్లో శివ సినిమా ఎలాగో.. ఈ జనరేషన్ లో అర్జున్ రెడ్డి సినిమా అలాగా.

మరి అలాంటి దర్శకుడు పైగా ఒక్క అర్జున్ రెడ్డి సినిమాని అటు హిందీలో షాహిద్ కపూర్ తో కబీర్ సింగ్ పేరుతొ తీసి ఏకంగా మూడొందల కోట్లు కొల్లగొట్టాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. మొత్తానికి ఈ సంచలన దర్శకుడు కూడా మెగాస్టార్ తో సినిమా చేయాలని ఒక కథ కూడా రాశాడట. చిరు బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా తానూ సినిమా చేస్తానని.. చిరుకి కథ చెప్పడానికి అపాయింట్ మెంట్ కూడా తీసుకున్నాడట. మెగాస్టార్ ఒక్క ఛాన్స్ ఇస్తే మాత్రం మరో వైవిధ్యమైన సినిమాతో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం గ్యారంటీ.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper