Samantha Second Marriage: సౌత్ ఇండియా లోనే మోస్ట్ క్రేజియస్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత మరియు నాగ చైతన్య విడిపోయి దాదాపుగా ఏడాది అయ్యింది..వీళ్లిద్దరు విడాకులు తీసుకున్నారు అనే వార్త పెద్ద సెన్సేషన్..ఇప్పటికి కూడా వీళ్ళు సోషల్ మీడియా లో నడిచే వెబ్ సైట్స్ మరియు యూట్యూబ్ చానెల్స్ కి న్యూస్ ఐటెం గానే కొనసాగుతున్నారు..రోజు వీళ్లిద్దరికీ సంబంధించి ఎదో ఒక వార్త సోషల్ మీడియా లో తిరుగుతూనే ఉంది..అయితే వీళ్లిద్దరు వాటిని పట్టించుకోకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ముందుకి వెళ్తున్నారు..కెరీర్ పరంగా అయితే ఈ ఇద్దరు జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నారు అనే చెప్పాలి..సమంత ఒక పక్క హీరోయిన్ గా చేస్తూనే మరో పక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది..ఈమె ప్రధాన పాత్రలో నటించిన యశోద అనే సినిమాకి సంబంధించిన టీజర్ ఈరోజు విడుదలైన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ టీజర్ కి నెటిజెన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..ఇదంతా పక్కన పెడితే సమంత గురించి సోషల్ మీడియా లో లేటెస్ట్ గా ప్రచారం అవుతున్న ఒక వార్త ఆమె అభిమానులను షాక్ కి గురి చేస్తుంది.

ఇక అసలు విషయానికి వస్తే సమంత బాలీవుడ్ లో ఫామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో విలన్ గా నటించిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ వెబ్ సిరీస్ లో సమంత చాలా బోల్డ్ సన్నివేశాలలో నటించింది..నాగ చైతన్య ఆమెకి విడాకులు ఇవ్వడానికి కారణం కూడా ఈ వెబ్ సిరీస్ అని అందరూ అంటూ ఉంటారు..ఒక ప్రముఖ బాలీవుడ్ టాప్ హీరో వల్ల సమంత కి ఈ వెబ్ సిరీస్ లో నటించే అవకాశం దక్కింది అని..అతనితో సమంత కి ఉన్న రిలేషన్ వల్లే నాగ చైతన్య మరియు సమంత మధ్య విభేదాలు వచ్చి విడిపోయారని ఫిలిం నగర్ లో ఒక వర్గం నుండి వినిపించే వార్త.

ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ ఎవరికీ తెలియదు కానీ..సమంత ప్రస్తుతం బాలీవుడ్ లో ఒక యంగ్ హీరో తో డేటింగ్ చేస్తుందని..త్వరలోనే అతనిని పెళ్లాడబోతుందని బాలీవుడ్ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ..సమంత కి బాలీవుడ్ లో ప్రస్తుతం వరుసగా అన్ని ఆఫర్లు రావడానికి కారణం కూడా అతనేనట..ఇంతకీ అతను ఎవరు అనేది తెలియాల్సి ఉంది..ఈ ఏడాది లోనే వీళ్లిద్దరి పెళ్లి జరగబోతున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి