IND vs AUS
IND vs AUS : ఈ మైదానంలో టీం మీడియా ఇప్పటికే వరుసగా మూడు విజయాలు సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాకిస్తాన్ జట్టుపై కూడా అదే స్థాయిలో గెలుపును సొంతం చేసుకుంది. ఇక న్యూజిలాండ్ జట్టుపై 249 పరుగులు చేసి.. విజయాన్ని అందుకుంది. ఫలితంగా గ్రూప్ – ఏ లో టీమిండియా మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత సెమి ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాతో తలపడింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 264 పరుగులు చేయగలిగింది. టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఊహించినంత భారీ స్టోర్ చేయలేకపోయారు. హెడ్ 39 పరుగుల వద్ద అవుట్ కావడంతో టీమ్ ఇండియాకు పెద్ద బ్రేక్ లభించింది. స్మిత్ కూడా 73 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ కావడంతో ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేయలేకపోయింది. మిగతా ఆటగాళ్లు అంతగా సహకరించకపోయినప్పటికీ క్యారి 61 పరుగులతో ఆకట్టుకున్నాడు. అందువల్లే ఆస్ట్రేలియా ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. దుబాయ్ మైదానంపై ఆస్ట్రేలియా 264 రన్స్ చేసిన నేపథ్యంలో.. 2011 నాటి మ్యాచ్ ను క్రికెట్ విశ్లేషకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
Also Read : 2023 నాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే.. 2011 రిపీట్ కావాల్సిందే.. నేడు భారత్ ఆస్ట్రేలియా మధ్య సెమీ ఫైనల్
2011లో ఏం జరిగిందంటే..
2011లో వన్డే వరల్డ్ కప్ భారత్ వేదికగా జరిగింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా – భారత్ తలపడ్డాయి. అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఆరు వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది.. పాంటింగ్ 104 పరుగులు చేశాడు. బ్రాడ్ హడిన్ 53, డేవిడ్ హస్సి 38 పరుగులు చేశారు. రవిచంద్రన్ అశ్విన్, జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్ తలా రెండు వికెట్లు సాధించారు. ఆస్ట్రేలియా విధించిన 261 పరుగుల టార్గెట్ ను టీమిండియా 47.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. యువరాజ్ సింగ్ (57*), సచిన్ టెండుల్కర్(53), గౌతమ్ గంభీర్ (50), సురేష్ రైనా (34), విరాట్ కోహ్లీ(24) పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించారు. బ్రెట్ లీ, షాన్ టైట్, డేవిడ్ హస్సి, షేన్ వాట్సన్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఆస్ట్రేలియాపై గెలిచిన అనంతరం టీమిండియా ఫైనల్ మ్యాచ్లో శ్రీలంకతో తలపడింది. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. కపిల్ దేవ్ తర్వాత టీమ్ ఇండియాకు వరల్డ్ కప్ అందించిన ఘనత మహేంద్రసింగ్ ధోనీకి దక్కింది. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్ ను 2011 నాటి వన్డే వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ తో క్రికెట్ విశ్లేషకులు పోల్చి చూస్తున్నారు. నాడు ఆస్ట్రేలియా 260 పరుగుల టార్గెట్ విధించగా.. ఇప్పుడు 264 పరుగుల టార్గెట్ విధించిందని.. టీమిండియా ఆ టార్గెట్ చేజ్ చేస్తుందని.. ఫైనల్ మ్యాచ్లో గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీని దక్కించుకుంటుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read : టీమిండియాలో వాళ్లతోనే మాకు డేంజర్.. భయపడుతున్న ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Ind vs aus will 2011 be repeated in dubai what happened in the match between australia and team india that day
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com