Naga Chaitanya and Samantha : సమంత(Samantha Ruth Prabhu) కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్ ఉండొచ్చు. రాబోయే రోజుల్లో ఇంకా ఆమె పెద్ద స్థాయికి వెళ్లొచ్చు. కానీ ఆమె కెరీర్ లో ఎప్పటికీ మర్చిపోలేని కొన్ని సినిమాలు ఉంటాయి. వాటిల్లో ఒకటి ‘ఏం మాయా చేసావే’. ఇదే ఆమె తొలిసినిమా, ఈ సినిమాతోనే ఆమె స్టార్ హీరోయిన్ గా కూడా మారిపోయింది. ఈ చిత్రాన్ని తమిళం, హిందీ భాషల్లో కూడా రీమేక్ చేసారు కానీ, సమంత, నాగ చైతన్య క్రియేట్ చేసిన మ్యాజిక్ ని మాత్రం రిపీట్ చేయలేకపోయారు. ఈ సినిమాని ఇప్పుడు చూసినా చాలా ఫ్రెష్ గానే అనిపిస్తాది. అంత అద్భుతంగా తెరకెక్కించాడు ఆ చిత్ర డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్. ఈ సినిమాలో సమంత, నాగచైతన్య(Akkineni Naga Chaitanya) మధ్య ఉన్న కెమిస్ట్రీ ని చూసినప్పుడే అందరికీ అప్పట్లోనే అనుమానం వచ్చింది. కచ్చితంగా భవిష్యత్తులో వీళ్ళు ప్రేమలో పెడతారేమో అని, ఊహించినట్టుగానే వీళ్లిద్దరు ప్రేమలో పడ్డారు, పెళ్లి చేసుకున్నారు.
కానీ దురదృష్టం కొద్దీ కొన్ని అనివార్య కారణాల వల్ల విడిపోయారు. ఈ సినిమా విడుదలై సరిగ్గా 15 సంవత్సరాలైంది. అంటే సమంత ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టి 15 ఏళ్ళు అయ్యింది అన్నమాట. ఈ సందర్భంగా తమిళనాడు కి చెందిన MCR గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సమంత కి ఒక అవార్డుని ప్రధానం చేసారు. బిహైండ్ వుడ్స్(Behind woods) గోల్డ్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’ క్యారగిరీలో ఈ అవార్డుని ఆమె అందుకుంది. ఈ విషయాన్నీ ఎంతో ఆనందంతో ఆమె తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అభిమానులు ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. అంతే కాకుండా నీ సినీ ప్రస్థానం నాగ చైతన్య సినిమాతోనే మొదలైంది అనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. నాగ చైతన్య తో ఈ సినిమా తర్వాత ఆమె ‘ఆటో నగర్ సూర్య’, ‘మనం’,’ మజిలీ’ వంటి చిత్రాలు చేసింది.
Also Read : మహేష్ బాబు ఆ ఒక్క పని చేసి ఉంటే నాగ చైతన్య సమంత పెళ్లి చేసుకునేవారు కాదా..?
‘మజిలీ’ చిత్రం పెళ్లి తర్వాత విడుదలై సూపర్ హిట్ స్టేటస్ ని అందుకుంది. ఇదంతా పక్కన పెడితే సమంత రీ ఎంట్రీ ఆశించిన స్థాయిలో అయితే వెళ్లడం లేదు. గత ఏడాది ఆమె నటించిన ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయ్యింది. ఈ వెబ్ సిరీస్ కి గొప్ప రెస్పాన్స్ ఏమి రాలేదు. అదే విధంగా ఈమెకు సినిమా అవకాశాలు కూడా ఒకప్పటి రేంజ్ లో రావడం లేదు. ప్రస్తుతం ఆమె తన సొంత నిర్మాణ సంస్థలో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా చేస్తుంది. అంతే కాకుండా నెట్ ఫ్లిక్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్న ‘రక్త బ్రహ్మాండ’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది. ఈ రెండు ప్రాజెక్ట్స్ తప్ప ఆమె చేతిలో మరో సినిమా లేదు. రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ కాకుండా, కేవలం ఛాలెంజింగ్ రోల్స్ మాత్రమే చేస్తాను అంటూ ఆమె చెప్పడంతో దర్శక నిర్మాతలు ఆమె వద్దకు రావడం లేదని ఒక టాక్ కూడా ఉంది.
Also Read : చైతు – సామ్ నిర్ణయం పై చర్చ తగదు !