Samantha-Naga Chaitanya : తన మొదటి సినిమా హీరోతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది సమంత. ఏమాయ చేసావే చిత్రంలో సమంత-నాగ చైతన్య జంటగా నటించారు. దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఏమాయ చేసావే సూపర్ హిట్. సమంత తన నటనతో కట్టిపడేసింది. ఆమెకు ఆఫర్స్ క్యూ కట్టాయి. టాలీవుడ్ వేదికగా అనతికాలంలో సమంత స్టార్ హీరోయిన్ అయ్యింది. అదే సమయంలో నాగ చైతన్యతో రహస్య ప్రేమాయణం నడిపింది. చాలా కాలం సమంత-నాగ చైతన్య డేటింగ్ చేశారు. ఈ క్రమంలో పలు చిత్రాల్లో జంటగా నటించారు .
2017లో తమ ప్రేమను పెళ్లి బంధంగా మార్చుకున్నారు. టాలీవుడ్ క్యూట్ కపుల్ గా నాగ చైతన్య-సమంత పేరు తెచ్చుకున్నారు. దాదాపు నాలుగేళ్లు అన్యోన్యంగా జీవించారు. వివాహం అనంతరం కూడా సమంత నటన కొనసాగించింది. ఆమె బోల్డ్ సీన్స్, గ్లామరస్ రోల్స్ చేసింది. కారణం తెలియదు కానీ.. నాగ చైతన్యకు సమంత దూరంగా ఉంటుందన్న న్యూస్ బయటకు వచ్చింది. కొన్ని నెలలు పుకార్లు చక్కర్లు కొట్టాయి. 2021 అక్టోబర్ నెలలో సమంత-నాగ చైతన్య అధికారికంగా విడాకులు ప్రకటించారు. పరస్పరం అవగాహనతో విడిపోతున్నట్లు వెల్లడించారు.
విడాకులు తీసుకున్న సమంతకు భరణం రూపంలో ఎంత దక్కింది అనే వాదన చాలా కాలంగా ఉంది. అక్కినేని నాగార్జున కుమారుడైన నాగ చైతన్యకు భారీగా ఆస్తులు ఉన్నాయి. తల్లి లక్ష్మి తరుపునుండి కూడా నాగ చైతన్యకు ఆస్తులు వస్తాయి. ఈ కారణంగా నాగ చైతన్య సమంతకు రూ. 200 కోట్ల వరకు భరణం రూపంలో చెల్లించాల్సి వచ్చిందట. అయితే సమంత ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. తాను స్వశక్తితో స్టార్ గా ఎదిగిన అమ్మాయి. నాకు మీ డబ్బు అవసరం లేదని సమంత భరణం తిరస్కరించారట. సమంత నిర్ణయం ఒకింత అక్కినేని ఫ్యామిలీ అహాన్ని దెబ్బతీసిందని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియదు.
నాగ చైతన్య ఇటీవల హీరోయిన్ శోభిత దూళిపాళ్లను రెండో వివాహం చేసుకున్నాడు. సమంత మాత్రం సింగిల్ స్టేటస్ అనుభవిస్తుంది. సమంత కెరీర్ ఇంకా స్వింగ్ లోనే ఉంది. ఆమె నటించిన హనీ బన్నీ సిరీస్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ది ఫ్యామిలీ మ్యాన్ 3లో సైతం సమంత నటించారని, త్వరలో స్ట్రీమ్ కానుందనే ప్రచారం జరుగుతుంది.