Samantha Tears: ప్రతీ ఏటా నార్త్ అమెరికా లో తానా(Telugu Association of North Ammerica) ఉత్సవాలను ఎంత ఘనంగా జరుపుతూ ఉంటారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. TANA అనగా ‘తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా’ అన్నమాట. ఈ అసోసియేషన్ అమెరికాలో ఉండే తెలుగు వాళ్లకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా చేస్తుంది. తెలుగు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులూ కూడా ప్రతీ ఏడాది ఈ తానా ఉత్సవాలలో పాల్గొంటూ ఉంటారు. ఈ ఏడాది కూడా చాలా గ్రాండ్ గా ఈ ఉత్సవాలను మొదలు పెట్టారు. ఈ ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun),సమంత(Samantha Ruth Prabhu), శ్రీలీల(Sreeleela), సుకుమార్(Sukumar) తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో సమంత మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. ఎందుకో ఆమెకు తెలుగు వాళ్ళ ఉత్సాహం చూసి కన్నీళ్లు వచ్చేసాయి. ఇంత ఎమోషనల్ గా సమంత మాట్లాడడం ఈమధ్య కాలంలో ఆమె అభిమానులు ఎప్పుడూ చూడలేదు.
Also Read: రెచ్చగొట్టిన బ్రూక్.. పద్ధతిగా ఇచ్చిపడేసిన పంత్.. అట్లుంటది మరీ (వీడియో)
ఇంతకూ ఆమె ఏమి మాట్లాడిందో చూద్దాం. ఆమె మాట్లాడుతూ ‘TANA ఉత్సవాల గురించి ప్రతీ ఏడాది నేను వింటూనే ఉంటాను. చాలా గొప్పగా ఈవెంట్ ని చేస్తుంటారు. నన్ను తెలుగు ప్రేక్షకులు మొదటి సినిమా నుండి ఇప్పటి వరకు ఆదరిస్తూనే ఉన్నారు. వాళ్ళు నాపై చూపించే ప్రేమకు వెలకట్టలేను. నాకు కెరీర్ ని, గుర్తింపు ని ఇచ్చి ఈ స్థాయికి తీసుకొచ్చింది తెలుగు వాళ్ళే. నేను ఇతర భాషల్లో సినిమాలు చేస్తూ ఉండొచ్చు, కానీ ఏ భాషలో సినిమా చేసినా నా తెలుగు ఆడియన్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాను. మీరు భౌగోళికంగా ఎంతో దూరం గా ఉన్నప్పటికీ నా హృదయం లో ఎప్పటికీ ఉంటారు’ అంటూ బాగా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లతో తన ప్రసంగాన్ని ముగించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతుంది.
అయితే గతం లో సమంత చెన్నై వెళ్లి అవార్డు ని అందుకున్నప్పుడు కూడా ఇలాగే ఎమోషనల్ అయ్యింది అంటూ సమంత తమిళ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే చాలా కాలం వరకు అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకున్న సమంత ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈసారి హీరోయిన్ గా కాదు, నిర్మాతగా. ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ అనే సంస్థ ని మొదలు పెట్టి ‘శుభమ్’ అనే చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా కమర్షియల్ గా మంచి సక్సెస్ అయ్యింది. క్రిటిక్స్ మనసుల్ని కూడా గెలుచుకుంది. రీసెంట్ గానే హాట్ స్టార్ లో విడుదలైన ఈ సినిమాకు ఓటీటీ ఆడియన్స్ నుండి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇకపోతే త్వరలోనే ఆమె ‘మా ఇంటి బంగారం’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా ద్వారా మన ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి కూడా సమంత నిర్మాతగా వ్యవహరించింది.
#SamanthaRuthPrabhu gets Emotional during her speech at #TANA Conference 2025.#TANA2025 pic.twitter.com/sFpx7K0BlM
— Gulte (@GulteOfficial) July 6, 2025