spot_img
Homeఎంటర్టైన్మెంట్Allu Arjun Rajinikanth Combo Movie: అల్లు అర్జున్ - రజినీకాంత్ కాంబోలో సినిమా రాబోతోందా.?...

Allu Arjun Rajinikanth Combo Movie: అల్లు అర్జున్ – రజినీకాంత్ కాంబోలో సినిమా రాబోతోందా.? హింట్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్…

Allu Arjun Rajinikanth Combo Movie: సౌత్ సినిమా ఇండస్ట్రీలో తన స్టైల్ తో ప్రేక్షకులందరిని మెప్పించిన నటుడు రజనీకాంత్… ఆయన లాంటి నటుడు ఇండస్ట్రీలో మరొకరు ఉండరు అనేది వాస్తవం… బస్ కండక్టర్ గా తన కెరియర్ మొదలుపెట్టిన రజనీకాంత్ ఆ తర్వాత నటుడిగా మారి ప్రేక్షకులందరిని ఆకర్షించాడు. ఇక నిదానంగా హీరోగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా అవతరించాడు… అలాంటి రజనీకాంత్ ఇప్పుడున్న చాలామంది యంగ్ హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. తను ఒక సినిమాని ఒప్పుకున్నాడు అంటే అందులో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుందనెంతలా పేరు ప్రఖ్యాతలను తెచ్చుకున్నాడు. ఇక తన సిగరెట్ కాల్చే స్టైల్ తో ప్రేక్షకులందరిని మైమరిపింప చేశాడు. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఆయన సినిమాలు డబ్ అవుతుండడంతో తెలుగులో సైతం ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది…

Also Read: రేవంత్ రెడ్డి మూడు ముక్కలాట..!

ఇక రీసెంట్ టైమ్ లో అల్లు అర్జున్ సైతం పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. తెలుగు సినిమా ఖ్యాతిని ఇండియా వైడ్ గా విస్తరింపజేసిన వారిలో అల్లు అర్జున్ కూడా ఒకరిగా నిలవడం విశేషం… రజినీకాంత్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది అంటూ కొన్ని వార్తలైతే వైరల్ అవుతున్నాయి.

ఇక వీళ్లిద్దరిని కలుపుతూ సినిమా చేసే దర్శకుడు ఎవరు అనే విషయం మీద పలు చర్చలైతే జరుగుతున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత లోకేష్ కనకరాజు దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో రజనీకాంత్ ఒక క్యారెక్టర్ లో నటిస్తున్నట్టుగా తెలుస్తుంది…ఈ పాత్ర అద్భుతంగా ఉండబోతుందట.

ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ ఫాదర్ క్యారెక్టర్ లో రజినీకాంత్ నటించబోతున్నారట. ఆయనకు ఒక సపరేట్ ఎపిసోడ్ ని కూడా డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ వార్త కనక నిజమైతే మాత్రం అటు తమిళ్, ఇటు తెలుగు తో పాటు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ బాక్సాఫీస్ లెక్కలు మొత్తం మారిపోవాల్సిందే అంటూ అల్లు అర్జున్ అభిమానులు సైతం వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular