Tholi Ekadasi: హిందూ సంప్రదాయంలో ప్రతీ పూజకు ఓ ప్రత్యేకత ఉంది. అయితే హిందూ సంప్రదాయంలో అన్ని పూజలు రావడానికి ముందు తొలి ఏకాదశి వస్తుంది. ఈ పూజ వచ్చిన తర్వాత అన్ని పండుగలు వస్తాయి. తొలి ఏకాదశి అనే చాలా పవిత్రమైనది. ఈ పండుగను తప్పకుండా అందరూ జరుపుకుంటారు. తొలి ఏకాదశిని పవిత్రంగా పూజించడం వల్ల మోక్షం కలుగుతుందని, కోరిన కోరికలు అన్ని కూడా జరుగుతాయని పండితులు చెబుతుంటారు. అయితే ఆషాఢ మాసంలో వచ్చే ఈ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. అలాగే శయన ఏకాదశి అని కూడా అంటారు. అయితే తొలి ఏకాదశి రోజు నుంచి మొత్తం నాలుగు నెలల పాటు విష్ణుమూర్తి పాలకడలి మీద నిద్రపోతారని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఏడాది మొత్తం వచ్చే ఏకాదశుల్లో పూజలు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో.. ఈ ఒక్క ఏకాదశి నాడు పూజలు నిర్వహిస్తే అంత పుణ్యం లభిస్తుందట.
Also Read: రెచ్చగొట్టిన బ్రూక్.. పద్ధతిగా ఇచ్చిపడేసిన పంత్.. అట్లుంటది మరీ (వీడియో)
అందుకే ఈ తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించి విష్ణుమూర్తిని పూజిస్తారు. ఈ ఏకాదశి ఉపవాసాన్ని కూడా దశమి రోజు నుంచే మొదలు పెట్టి ద్వాదశి తిథి వచ్చే వరకు ఉంటారు. ఇలా ఉపవాసం చేయడం వల్ల మోక్షం లభిస్తుందని, కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. అయితే ద్వాదశి తిథి నాడు ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించిన తర్వాత ఉపవాసం విరమించాలి. ఇలా చేస్తేనే పుణ్యం లభిస్తుందని పండితులు అంటున్నారు. అయితే తొలి ఏకాదశి నాడు ఉదయాన్నే లేచి పూజలు నిర్వహించాలి. పండ్లు, పువ్వులతో భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం వల్ల కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయని పండితులు అంటున్నారు. పూజలు నిర్వహించి, ఉపవాసం ఆచరించి, జాగరణ చేస్తే పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అయితే ఈ తొలి ఏకాదశి పేరు ఎలా వచ్చింది? ఎందుకు పవిత్రంగా తొలి ఏకాదశిని పూజిస్తారు? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
కృతాయుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మ వరంతో దేవతలు, రుషులను హింసించేవాడట. అయితే శ్రీ హరి ఆ రాక్షసుడితో 1000 పోరాడి అలసిపోయి ఒక గుహలో సేద తీరాడు. అప్పుడు శ్రీ హరి శరీరం నుంచి ఒక యోగమాయ పుట్టి.. ఆ రాక్షసుడిని అంతం చేసిందట. ఆ తిథిని ఏకాదశిగా శ్రీ హరి అన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తొలి ఏకాదశిగా పిలుస్తారు. ఈ ఏకాదశి చాలా ప్రత్యేకమైనది. ఈ తొలి ఏకాదశి నాడు విష్ణువును పూజించడం చాలా మంచిది. ఇంతటి ముఖ్యమైన రోజు ఏదైనా పని చేపట్టినా కూడా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈ ఏకాదశి నాడు తప్పకుండా ఉపవాసం ఆచరించాలని అంటున్నారు. ఉపవాసం ఆచరించడం వల్ల మోక్షం కలుగుతుందని, కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.