Eng Vs Ind 2nd Test: సింహం సైలెంట్ గా ఉందని.. రెచ్చగొట్టొద్దు. ఆ తర్వాత సింహం రెచ్చిపోతే ఏం జరుగుతుందో చెప్పాల్సిన పనిలేదు. అప్పటిదాకా సైలెంట్ గా ఉన్న వాతావరణం వైలెంట్ అయిపోతుంది. రెచ్చగొట్టిన మనిషి భూమ్మీద ఉండడు. అందుకే ఉత్పాతాన్ని కొని తెచ్చుకోకూడదు. ప్రళయాన్ని చూడాలనుకోకూడదు. ఉపద్రవాన్ని వీక్షించాలని భావించకూడదు.. ఇండియన్ క్రికెట్లో ఇప్పటి కాలంలో సింహం లాంటి ఆటగాడు ఒకరున్నారు. సాధారణంగా అయితే తన ఆట తాను ఆడి వెళ్ళిపోతుంటాడు. ఎవరినీ గెలకడు. గెలికే ప్రయత్నం కూడా చేయడు. పొరపాటున తనను గెలికితే మాత్రం అసలు ఊరుకోడు. ఇప్పుడు ఇలాంటి అనుభవాన్ని ఇంగ్లాండ్ ఆటగాడు బ్రూక్ కు కళ్ళ ముందు ఉంచాడు.. ఇంతకీ ఆటగాడు ఎవరు? మైదానంలో ఏం జరిగిందంటే..
Also Read: అంగరంగ వైభవంగా తానా 24వ మహాసభలు..అమెరికాలో తెలుగువారి ఘనమైన సంబరాలు
సాధారణంగా రిషబ్ పంత్ దూకుడుగా ఆడుతుంటాడు.. డిఫెన్స్ ను పక్కన పెట్టి వచ్చిన ప్రేక్షకులను.. తన అభిమానులను ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు.. పొరపాటున ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు తనను రెచ్చగొడితే మాత్రం ఘోరంగా రెచ్చిపోతాడు. ఏ మాత్రం భయపడకుండా పరుగులు తీస్తాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతాడు. ఆడుతోంది ఏ ఫార్మాట్ అయినా సరే పరుగుల వరద పారిస్తాడు. అందువల్లే అతడిని ఈ కాలంలో సింహం లాంటి ఆటగాడు అని పిలుస్తుంటారు. పైగా అతడు తన శరీర సామర్థ్యాన్ని అదేవిధంగా కొనసాగిస్తాడు. ఆట సామర్థ్యాన్ని కూడా అదేవిధంగా ప్రదర్శిస్తాడు. అందుకే అతడిని గెలకడానికి ప్రత్యర్థి ప్లేయర్లు వెనకడుగు వేస్తారు. కానీ ఈ విషయం ఇంగ్లాండ్ ప్లేయర్లకు అర్థం కాలేదు. ముఖ్యంగా బ్రూక్ కు అవగతం కాలేదు.
రెండో టెస్ట్ జరుగుతున్న క్రమంలో.. భారత రెండవ ఇన్నింగ్స్ సమయంలో కేఎల్ రాహుల్ అవుట్ అయిన తర్వాత రిషబ్ పంత్ మైదానంలోకి వచ్చాడు. వచ్చి రావడమే దూకుడుగా ఆడటం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో పంత్ కు దగ్గర్లో ఫీల్డింగ్ చేస్తున్న బ్రూక్ పంత్ ను రెచ్చగొట్టాడు.. మాటలతో కవ్వించే ప్రయత్నం చేశాడు..” పంత్.. క్రికెట్లో మీ అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు గురించి చెప్పవా” అని బ్రూక్ అన్నాడు. “వేగవంతమైన సెంచరీ గురించా? అది టెస్ట్ లలో చేశాను. గంటన్నర వ్యవధిలోనే సెంచరీ పూర్తి చేసుకున్నానని” పంత్ బదులిచ్చాడు. ” ఇప్పుడు కూడా అదే స్థాయిలో చేయగలవా” అని బ్రూక్ రెచ్చగొట్టాడు. దానికి పంత్ గట్టిగానే బదులిచ్చాడు. కచ్చితంగా అవుతుంది.. కచ్చితంగా చేయగలను అంటూ పంత్ సమాధానం చెప్పాడు. ఇక రెండవ ఇన్నింగ్స్ లో పంత్ 58 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, 3 సిక్సర్లతో 65 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో 25 పరుగులు చేశాడు. రెండవ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రిషబ్ పంత్ దూకుడు ప్రదర్శించాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడు. ముఖ్యంగా బ్యాట్ వదిలిపెట్టడంతో మైదానంలో సందడి నెలకొంది. రెండుసార్లు కూడా బంతిని కొట్టే క్రమంలో పంత్ బ్యాట్ వదిలిపెట్టడం విశేషం.
Records? #RishabhPant’s reply will win your respect. #HarryBrook asked about the fastest hundred and Pant’s response was pure humility. ✨#ENGvIND 2nd TEST, Day 4 | LIVE NOW on JioHotstar ➡ https://t.co/2wT1UwEcdi pic.twitter.com/MEx6HVDUJH
— Star Sports (@StarSportsIndia) July 5, 2025