spot_img
Homeఎంటర్టైన్మెంట్Balakrishna Ram Charan Movie Combo Missed Film: బాలయ్య - రామ్ చరణ్ కాంబోలో...

Balakrishna Ram Charan Movie Combo Missed Film: బాలయ్య – రామ్ చరణ్ కాంబోలో మిస్ అయిన సినిమా ఏంటంటే..?

Balakrishna Ram Charan Movie Combo Missed Film: మెగాస్టార్ చిరంజీవి – నందమూరి బాలకృష్ణ మధ్య గత 50 సంవత్సరాల నుంచి పోటీ ఉంది. ఎప్పటికప్పుడు ఎవరికి వాళ్లు సినిమాలను చేస్తూ టాప్ హీరోగా ఎదగడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఒకరిని మించిన సినిమాలు మరొకరు చేయడంలో ఇద్దరు సక్సెస్ లను సాధించారనే చెప్పాలి. ఇద్దరి మధ్య సినిమాల పరంగా పోటీ ఉన్నప్పటికి వాళ్లలో పర్సనల్ విషయాల్లో మాత్రం వల్ల మధ్య చాలా మంచి బాండింగ్ ఉంటుంది. వాళ్ళిద్దరు ఎవరికి వాళ్లు సినిమాలను ఎంచుకొని చేస్తున్నారు. అలాగే ఒకరి ఇంట్లో ఫంక్షన్ అయితే మరొకరు దానికి అటెండ్ అవ్వడం కలిసిమెలిసి ఉండడం అనేది వాళ్ళకే చెల్లింది. అందుకే సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ అంటూ రెండు ఫ్యామిలీలు మాత్రమే బలంగా నిలబడ్డాయి.

Also Read: సల్మాన్ అఘా ను పిచ్చోన్ని చేసిన బంగ్లా బౌలర్.. ఫ్యూజులు ఎగిరిపోయే వీడియో ఇది!

ఈ రెండు ఫ్యామిలీల హీరోలను కలుపుతూ రాజమౌళి ‘త్రిబుల్ ఆర్’ సినిమా తీశాడు. నందమూరి అభిమానులు సైతం ఈ సినిమా పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇక బాలయ్య బాబు – రామ్ చరణ్ కాంబినేషన్ లో కూడా ఒక సినిమా రావాల్సి ఉందనే విషయంలో చాలామందికి తెలియదు. గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక భారీ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమానైతే ప్లాన్ చేశారట.

కథ కూడా ఇద్దరికి వినిపించాడట. కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమా పట్టలేక్కలేదు. చిరంజీవి సైతం ఆ స్క్రిప్ట్ కి చాలా ఎగ్జైట్ అయ్యాడట. మరి ఎందుకని ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు అనే విషయం మీద సరైన క్లారిటీ లేదు. కానీ మొత్తానికైతే బాలయ్య – రామ్ చరణ్ మధ్య చాలా మంచి బాండింగ్ ఉంది.

ఆ బాండింగ్ ని వాడుకొని సినిమాని సూపర్ సక్సెస్ చేయాలని దర్శకులు అనుకున్నప్పటికి అది వర్కౌట్ కాకపోవడంతో అభిమానులు తీవ్రమైన నిరాశను వ్యక్తం చేశారు…ఇక వీలైనంత తొందర్లో వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular